'నేను మధ్య-తరగతి కుటుంబంలో పెరిగాను': గూగుల్ సీఈఓ చిన్నప్పటి ఙ్ఞాపకాలు...

By Ashok kumar Sandra  |  First Published May 9, 2024, 10:48 AM IST

“నా తల్లిదండ్రులు ఎప్పుడు చదువు, విజ్ఞానాన్ని నొక్కి చెప్పేవారు, కొన్ని మార్గాల్లో అదే లక్ష్యం. ఇది ఎల్లప్పుడూ నాలో చాలా లోతుగా గుర్తు చేస్తుంది. నేను నేర్చుకోవడం, జ్ఞానం ఈ అన్వేషణను అనుభవించాను, ఈ సంస్థ గురించి కూడా ఇదే అని అన్నారు. 
 


గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఎంతో మంది భారతీయలకు పోస్టర్ బాయ్‌గా ఉన్నారు. అయితే సుందర్ పిచాయ్ చెన్నైలో పెరిగి, IIT ఖరగ్‌పూర్లో చదివి చివరికి Googleలో చేరాడు. తాజాగా బ్లూమ్‌బెర్గ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, సుందర్ పిచాయ్ తన బాల్యం గురించి,  2015లో CEOగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి తన వర్క్ ఫిలోసఫి మాత్రమే కాకుండా మొత్తం కంపెనీని ఎలా ప్రభావితం చేసిందో గురించి మాట్లాడాడు.  

“నా తల్లిదండ్రులు ఎప్పుడు చదువు, విజ్ఞానాన్ని నొక్కి చెప్పేవారు, కొన్ని మార్గాల్లో అదే లక్ష్యం. ఇది ఎల్లప్పుడూ నాలో చాలా లోతుగా గుర్తు చేస్తుంది. నేను నేర్చుకోవడం, జ్ఞానం ఈ అన్వేషణను అనుభవించాను, ఈ సంస్థ గురించి కూడా ఇదే అని అన్నారు. 

Latest Videos

undefined

తను టెక్నాలజీని ఎందుకు గ్రాంట్‌గా తీసుకోలేదో కూడా వివరించాడు. అతను స్కూల్ వెళ్ళే చిన్నప్పుడు ఫోన్  ప్రభావాన్ని మొదటిసారి అనుభవించిన తన రోజులను జ్ఞాపకం చేసుకున్నాడు. గేర్‌లు లేని సాధారణ సైకిల్ నుండి తన మార్పు గురించి ఇంకా వారి ప్రభావం గురించి కూడా మాట్లాడాడు. 

“నేను మధ్యతరగతి కుటుంబంలో పెరిగాను. గాడ్జెట్‌ల ద్వారా జీవితాలను నేను గ్రహించాను. మేము టెలిఫోన్ కోసం ఐదు సంవత్సరాలు వేచి  చూసాము, అది రోటరీ ఫోన్. కానీ అది మా ఇంటికి వచ్చేసరికి మా జీవితాన్నే మార్చేసింది. మా మొదటి టీవీ  కొనడం, స్పోర్ట్స్  చూడడం నాకు గుర్తుంది అని అన్నారు. 
 
 “నేను సైకిల్  పై చాలా దూరం స్కూల్ వెళ్ళేవాడిని, సైకిల్ కి గేర్ లేదు. చాలా సంవత్సరాల తర్వాత నాకు గేర్లు ఉన్న బైక్ వచ్చింది అండ్  నేను వావ్! ఎంత నాటకీయమైన తేడా. నేను టెక్నాలజీని ఎప్పుడూ పెద్దగా పట్టించుకోలేదు. టెక్నాలజీ  ఎలా వైవిధ్యాన్ని కలిగిస్తుందనే దాని గురించి నేను ఎప్పుడు ఆశావాదంతో ఉన్నాను అని కూడా అన్నారు. 

AI యుగంలో Google సెర్చ్ ఇప్పటికీ ఎలా సంబంధితంగా ఉందో కూడా పిచాయ్ మాట్లాడారు. AI క్రమంగా Google వంటి సెర్చ్   ఇంజిన్‌లను రీప్లేస్  చేయడానికి ప్రయత్నిస్తున్నందున, రెండింటికీ స్పెస్ ఉందని పిచాయ్ పేర్కొన్నారు. చాలా మంది  క్విక్  సెర్చ్  అలాగే కొంత సంబంధిత సమాచారాన్ని కూడా కోరుకుంటున్నారు అని అన్నారు. 

click me!