బంపర్ ఆఫర్...రూ.99కే నోకియా స్మార్ట్ ఫోన్

By ramya neerukondaFirst Published Oct 17, 2018, 11:34 AM IST
Highlights

కేవలం 99 రూపాయల డౌన్‌పేమంట్‌లో ఎంపిక చేసిన నోకియా బ్రాండెడ్‌ స్మార్ట్‌ఫోన్లను కొనుగోలు చేయవచ్చని హెచ్‌ఎండీ గ్లోబల్‌ తెలిపింది.

హెచ్ఎండీ గ్లోబల్ సంస్థ వినియోగదారుల కోసం బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం 99 రూపాయల డౌన్‌పేమంట్‌లో ఎంపిక చేసిన నోకియా బ్రాండెడ్‌ స్మార్ట్‌ఫోన్లను కొనుగోలు చేయవచ్చని హెచ్‌ఎండీ గ్లోబల్‌ తెలిపింది. మిగతా మొత్తాన్ని నో - కాస్ట్‌ ఈఎంఐ ఆప్షన్‌లో నెలవారీ ఇన్‌స్టాల్‌మెంట్‌లో చెల్లించవచ్చని పేర్కొంది.

ఈ ఆఫర్‌ 2018 నవంబర్‌ 10 వరకు అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఈ ఆఫర్‌లోనే హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ లేదా డెబిట్‌ కార్డులపై 10 శాతం క్యాష్‌బ్యాక్‌ అందుబాటులో ఉంటుంది. హెచ్‌ఎండీ గ్లోబల్‌ లైనప్‌లో అందుబాటులో ఉన్న ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ నోకియా 8 సిరాకో పై హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ లేదా డెబిట్‌ కార్డుదారులకు 15 శాతం క్యాష్‌బ్యాక్‌ లభిస్తోంది. అయితే ఈ క్యాష్‌బ్యాక్‌ కార్పొరేట్‌, బిజినెస్‌, కమర్షియల్‌ క్రెడిట్‌ కార్డులకు వర్తించదు.

నోకాస్ట్‌ ఈఎంఐలో రూ.99కే అందుబాటులో ఉన్న ఫోన్లు...
నోకియా 1, నోకియా 2.1, నోకియా 5.1, నోకియా 6.1, నోకియా 3.1 ప్లస్, నోకియా 8 సిరాకో. నోకియా 3.1ప్లస్‌ను ఇటీవలే లాంచ్‌ చేసింది.

click me!