ఎయిర్ టెల్ కి జియో మరో షాక్

By telugu teamFirst Published Jul 19, 2019, 2:08 PM IST
Highlights

మే చివరి నాటికి జియోకు 322.98 మిలియన్ల వినియోగదారులుండగా, ఎయిర్‌టెల్ 320.38 మిలియన్ల యూజర్లను సాధించింది.  వోడాఫోన్ ఐడియా 387.55 మిలియన్ల వినియోగదారులతో అగ్రస్థానంలో కొనసాగుతోంది

ప్రముఖ టెలికాం ఆపరేటర్ ఎయిర్ టెల్ కి మరో టెలికాం సంస్థ జియో భారీ షాక్ ఇచ్చింది. గతంలో వినియోగదారుల సంఖ్య విషయంలో తొలి స్థానంలో ఉండే ఎయిర్ టెల్ తన స్థానాన్ని కోల్పోయింది. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ లాభదాయకమైన టెలికాం ఆపరేటర్ గా నిలిచింది. ముఖ్యంగా మొబైల్ వినియోగదారుల పరంగా ఎయిర్ టెల్ ని రిలయన్స్ జియో దాటేసింది.

మొదటిస్థానంలో ఐడియా-వొడా ఫోన్ ఉండగా... రెండో స్థానాన్ని జియో నిలపెట్టుకుంది. ఇక మూడో స్థానానికి ఎయిర్ టెల్ చేరుకుంది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా శుక్రవారం ఈ వివరాలను వెల్లడించింది. మే చివరి నాటికి జియోకు 322.98 మిలియన్ల వినియోగదారులుండగా, ఎయిర్‌టెల్ 320.38 మిలియన్ల యూజర్లను సాధించింది.వోడాఫోన్ ఐడియా 387.55 మిలియన్ల వినియోగదారులతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

రిలయన్స్ శుక్రవారం క్యూ1 ఫలితాలను ప్రకటించనుంది. ఖాతారుల విషయంలో జియో మెరుగైన ఆదాయాన్ని వెల్లడించనుందని ఈ సందర్భంగా కంపెనీ భావిస్తోంది. అయితే 329 మిలియన్లతో రిలయన్స్ ఇండస్ట్రీస్ టెలికాం సంస్థ 119 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని నివేదిస్తుందని గోల్డ్‌మన్ సాచ్స్ ఆశిస్తుండగా, ఆర్పూ(ఏఆర్‌పీయూ, వినియోగదారుకు సగటు ఆదాయం)125కు పడిపోతుందని భావిస్తున్నారు. మార్చి త్రైమాసికంలో 111 బిలియన్ డాలర్ల ఆపరేటింగ్‌ రెవెన్యూని సాధించగా రూ. 840 కోట్ల లాభాలను సాదించింది. మార్చి చివరి నాటికి 306 మిలియన్ల చందాదారులున్నారు.
 

click me!