తిరుపతిలో షియోమీ ప్రొడక్షన్ యూనిట్

By Siva KodatiFirst Published Jun 16, 2019, 10:45 AM IST
Highlights

చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ దిగ్గజం షియోమీ.. అనుబంధ హోలీటెక్ సంస్థ పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి పుణ్యక్షేత్రంలో కాంపొనెంట్స్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. 

చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజాల్లో ఒక్కటి షియోమీ మరో కీలక నిర్ణయం తీసుకున్నది. కలియుగ వైకుంఠంగా పేరొందిన తిరుపతిలో షియోమీ అనుబంధ హోలీ టెక్ టెక్నాలజీ సంస్థ ఉత్పాదక యూనిట్ ఏర్పాటు చేయబోతోంది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గ్రేటర్ నోయిడాలో తొలి ఉత్పాదక యూనిట్ నిర్మాణ పనులు చేపట్టింది. 

వచ్చే మూడేళ్లలో షియోమీ అనుబంధ సంస్థ హోలీటెక్ సుమారు 200 మిలియన్ల డాలర్ల పెట్టుబడులు పెట్టింది. వీటిని కంపాక్ట్ కమెరా మాడ్యూల్స్ (సీసీఎం), కెపాసిటీవ్ టచ్ స్క్రిన్ మాడ్యూల్ (సీటీపీ), థిన్ ఫిల్మ్ ట్రాన్సిస్టర్ (టీఎఫ్టీ), ఫ్లెక్సిబుల్ ప్రింటెడ్ సర్క్యూట్స్ (ఎఫ్‪పీసీ), ఫింగర్ ప్రింట్ మాడ్యూల్ తయారీ కోసం ఖర్చు చేస్తామని షియోమీ తెలిపింది. 

గ్రేటర్ నోయిడాలోని మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్ ఈ ఏడాది మూడో త్రైమాసికంలో ఉత్పత్తి ప్రారంభించనున్నది షియోమీ. తద్వారా 6000 మందికి కొత్తగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. షియోమీ మొబైల్ ఫోన్లలో ఉపయోగిస్తున్న కెమెరా మాడ్యూల్స్, టచ్ ప్యానెళ్లను తిరుపతి మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌లో ఉత్పత్తి చేయనున్నారు.

నాలుగు ఫ్యాక్టరీలంత నిడివితో 25 వేల ఎస్‌క్యూఎం విస్తీర్ణంలో గ్రేటర్ నోయిడా ఉత్పాదక యూనిట్ సిద్ధం అవుతోంది. ఏటా 300 మిలియన్ల కాంపొనెంట్ల నిర్మాణం చేపట్టనున్దని. గ్రేటర్ నొయిడా షియోమీ ఉత్పాదక కేంద్రం హోలీటెక్, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త భాగస్వామ్యంలో నిర్మాణం అవుతున్నది.

హోలీటెక్ సీఈఓ చెంగ్గుయి షెంగ్ మాట్లాడుతూ ‘కెమెరా మాడ్యూల్స్‌, సీటీపీ, టీఎఫ్టీ, ఎఫ్పీసీ, ఫింగర్ ప్రింట్ మాడ్యూల్, ప్రొపెల్ తదితర కాంపొనెంట్స్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారి ఉత్పత్తి చేస్తున్నందుకు సంతోషంగా ఉంది ’అని చెప్పారు.  

click me!