ఇక నుంచి ఫ్లిప్ కార్ట్ వస్తువులను ఇన్సూరెన్స్

By ramya neerukondaFirst Published Oct 8, 2018, 2:20 PM IST
Highlights

ప్రముఖ బీమా సేవల సంస్థయైన బజాజ్ అలయెన్జ్ జనరల్ ఇన్సూరెన్స్‌తో సంప్రదింపులు జరిపింది.  ఇప్పటికే ఇరు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా ప్రముఖ మొబైల్ బ్రాండ్లకు బీమా కవరేజ్ కల్పిస్తున్నాయి.

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ ఫ్లిప్ కార్ట్ గురించి తెలియని వారుండరు అనడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటి వరకు ఫ్లిప్ కార్ట్ లో మీకు నచ్చిన ఎన్నో వస్తువులను కొనుగోలు చేసుంటారు. ఇక నుంచి ఆ వస్తువులను ఇన్సూరెన్స్ కూడా లభించనుంది. కాకపోతే ఈ ఇన్సూరెన్స్  కేవలం స్మార్ట్ ఫోన్లకి మాత్రమే వర్తిస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఫ్లిప్‌కార్ట్..బీమా రంగంలోకి ప్రవేశించడానికి ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. ఇందుకు సంబంధించి ప్రముఖ బీమా సేవల సంస్థయైన బజాజ్ అలయెన్జ్ జనరల్ ఇన్సూరెన్స్‌తో సంప్రదింపులు జరిపింది.  ఇప్పటికే ఇరు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా ప్రముఖ మొబైల్ బ్రాండ్లకు బీమా కవరేజ్ కల్పిస్తున్నాయి. ఈ నెల 10 నుంచి కంపెనీ ప్రకటించిన బిగ్ బిలియన్ డేస్(టీబీబీఎస్) నుంచి ఈ బీమా కవరేజ్ ఆఫర్ లభిస్తున్నదని కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రవి గరికపాటి తెలిపారు.

ఒకవేళ స్మార్ట్‌ఫోన్ పాడైన వీటికి ఆన్‌లైన్ ద్వారానే క్లెయిం చేసుకోవచ్చునని ఆయన సూచించారు. భారత్‌లో ప్రస్తుతం 36 శాతం మంది స్మార్ట్‌ఫోన్లు వినియోగిస్తున్నారని, వీరికి ఎలాంటి బీమా లేదని ఆయన వెల్లడించారు. స్మార్ట్‌ఫోన్ల స్క్రీన్లు పలిగిపోయినప్పుడు లేదా చోరికి గురైనప్పుడు వినియోగదారుడు తీవ్ర ఆందోళనను ఎదుర్కొవాల్సి వస్తున్నదని, దీనికి విరుగుడుగా ఈ బీమా కవరేజ్ కల్పిస్తున్నట్లు ఆయన చెప్పారు.
 

click me!