ఎయిర్ టెల్ కి భారీ షాక్.. 5.7కోట్ల మంది గుడ్ బై

By ramya NFirst Published Feb 1, 2019, 4:59 PM IST
Highlights

ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్ టెల్ కి  భారీ షాక్ తగిలింది. దేశంలోని అతి పెద్ద టెలికాం ఆపరేటర్లలో ఒకటిగా ఉన్న ఎయిర్ టెల్.. నెమ్మదిగా తన స్థానాన్ని కోల్పోతోంది. 

ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్ టెల్ కి  భారీ షాక్ తగిలింది. దేశంలోని అతి పెద్ద టెలికాం ఆపరేటర్లలో ఒకటిగా ఉన్న ఎయిర్ టెల్.. నెమ్మదిగా తన స్థానాన్ని కోల్పోతోంది. జియో కారణంగానే ఇప్పటికే చాలా మంది వినియోగదారులను కోల్పోయిన ఎయిర్ టెల్ తాజాగా.. మరికొంత మంది కష్టమర్లను కోల్పోయింది.

గతేడాది డిసెంబర్ నెలలో 5.7కోట్ల మంది వినియోగదారులను ఎయిర్ టెల్ కోల్పోయింది. దీంతో నవంబర్ లో 34.1 కోట్ల మంది మొబైల్ వినియోగదారులతో ప్రత్యర్థి కంపెనీలకు అందనంత దూరంలో ఉన్న ఎయిర్ టెల్ కష్టమర్ బేస్ డిసెంబర్ చివరి నాటికి 28.42కోట్లకు పడిపోయింది. 

ప్రస్తుతం ఎయిర్ టెల్ రిలయన్స్ జియోకి చేరువైంది. డిసెంబర్ చివరి నాటికి జియో వినియోగదారుల సంఖ్య 28కోట్లు. అంటే రెండింటి మధ్య 42 లక్షలు మాత్రమే. రిలయన్స్  అందించే ఆఫర్లు, టారిఫ్ లు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి కాబట్టి.. త్వరలోనే జియో ఎయిర్ టెల్ దాటేసే అవకాశం లేకపోలేదు. 

click me!