వాట్సాప్ మెసేజెస్ ఇతరులు యాక్సెస్ చేయలేరు.. పాస్‌వర్డ్‌లు లేదా బయోమెట్రిక్ ఐడీ పాటించండి..

By Sandra Ashok KumarFirst Published Sep 25, 2020, 2:13 PM IST
Highlights

 సోషల్ మీడియా నెట్‌వర్క్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ గురువారం వాట్సాప్  మెసేజెస్ కి  ఎలాంటి ముప్పు లేదని, యూజర్ల మెసేజెస్ కి పూర్తి భదత్ర ఉందని, థర్డ్ పార్టీ వాటిని యాక్సెస్ చేయలేదని తెలిపింది. 

న్యూ ఢీల్లీ: బాలీవుడ్ ఇండస్ట్రిలోని హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసు దర్యాప్తులో డ్రగ్స్, మాదకద్రవ్యాల వినియోగం బయటపడటంతో తీవ్ర పరిణామం చోటు చేసుకుంది. ఇందులో వాట్సాప్ చాట్ కీలకంగా మారిన నేపథ్యంలో సోషల్ నెట్‌వర్క్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ స్పందించింది.

సోషల్ మీడియా నెట్‌వర్క్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ గురువారం వాట్సాప్  మెసేజెస్ కి  ఎలాంటి ముప్పు లేదని, యూజర్ల మెసేజెస్ కి పూర్తి భదత్ర ఉందని, థర్డ్ పార్టీ వాటిని యాక్సెస్ చేయలేదని తెలిపింది. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో సెల్‌ఫోన్ నుంచి యాక్సెస్ చేసిన 2017 నాటి చాట్‌ల ఆధారంగా కేంద్ర ఏజెన్సీ నటి దీపికా పదుకొనే, శ్రద్ధా కపూర్‌లను  విచారణకు పిలిపించింది.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ 14న తన ముంబై అపార్ట్‌మెంట్‌లో చనిపోయిన సంగతి తెలిసిందే. "వాట్సాప్ లో మీ మెసేజెస్ ని ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ రక్షిస్తుందని, తద్వారా మీరు చాట్ చేస్తున్న వ్యక్తికి మాత్రమే మీరు పంపిన మెసేజెస్ చదవగలరు.

వాట్సాప్  మెసేజెస్ ని మధ్యలో ఎవరూ దానిని యాక్సెస్ చేయలేరు, ప్రజలు ఫోన్ నంబర్‌ను మాత్రమే ఉపయోగించి వాట్సాప్‌లో సైన్ అప్ చేస్తారని గుర్తుంచుకోవడం ముఖ్యం, మీ మెసేజెస్ కంటెంట్‌కు వాట్సాప్‌కు కూడా అక్సెస్ లేదు "అని  వాట్సాప్ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఫోన్ నంబర్‌ను మాత్రమే వాట్సాప్‌లో ఉపయోగిస్తారు కనుక మిగతా సమాచారం లీక్ అయ్యే అవకాశం లేదని వాట్సాప్ ప్రతినిది ఒకరు తెలిపారు.

also read శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్ సిరీస్ మొట్టమొదటి స్మార్ట్ ఫోన్.. లాంచ్ ఎప్పుడంటే ? ...

అలాగే ఫోన్ డాటాను ఇతరులు యాక్సెస్ చేయకుండా బలమైన పాస్‌వర్డ్‌లు లేదా బయోమెట్రిక్ ఐడీలు వంటి అన్ని భద్రతా ఫీచర్లను సద్వినియోగం చేసుకోవాలని యూజర్లకు విజ్ఞప్తి చేశారు.  2005 నుండి మొబైల్ ఫోన్ క్లోనింగ్ టెక్నిక్ ఉపయోగించి మెసేజెస్ యాక్సెస్ చేయవచ్చు అని  చాలా మంది నమ్ముతారు. క్లోన్ చేసిన ఫోన్ వాట్సాప్ బ్యాకప్ చాట్‌లను యాక్సెస్ చేయగలదు, అది కూడా ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ లేని మెసేజెస్ మాత్రమే.

క్లోనింగ్ అనేది ఒక టెక్నిక్, దీని ద్వారా డేటా, టార్గెట్ ఫోన్ సెల్యులార్ ఐడెంటిటీ కొత్త ఫోన్‌లోకి కాపీ చేయబడతాయి. ప్రస్తుతం టార్గెట్ ఫోన్‌కు అక్సెస్ లేకుండా యాప్ ద్వారా చేయవచ్చు. ఇది చట్టబద్ధం కానప్పటికీ, ఫోన్‌లలో స్టోర్ చేసిన డేటాను చట్టబద్ధంగా యాక్సెస్ చేయడానికి అధికారులు ఫోరెన్సిక్ పద్ధతి ద్వారా వెళ్ళవచ్చు.

దీపికా పదుకొనే, ఆమె భర్త హీరో రణ్‌వీర్ సింగ్ గురువారం సాయంత్రం గోవా నుంచి ముంబైకి చేరుకున్నారు. దీపికా పదుకొనే, శ్రద్ధా కపూర్‌లను శనివారం ప్రశ్నించే అవకాశం ఉంది.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ స్నేహితురాలు, నటి రియా చక్రవర్తిని ఏజెన్సీ ప్రశ్నించిన తరువాత సారా అలీ ఖాన్, రకుల్ ప్రీత్ సింగ్ ఎన్‌సిబి  సమలు జారీ చేసింది. గురువారం ఏజెన్సీ ముందు హాజరు కావాల్సిన నటి రకుల్ ప్రీత్ సింగ్‌ను శుక్రవారం ప్రశ్నించనున్నారు. గురువారం గోవా నుంచి తిరిగి వచ్చిన సారా అలీ ఖాన్‌ను శనివారం ప్రశ్నించే అవకాశం ఉంది.

click me!