Asianet News TeluguAsianet News Telugu

శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్ సిరీస్ మొట్టమొదటి స్మార్ట్ ఫోన్.. లాంచ్ ఎప్పుడంటే ?

శామ్సంగ్ కొత్తగా ప్రకటించిన ‘ఎఫ్ సిరీస్’ లో ఈ ఫోన్ మొదటిది. ఫోన్ కోసం ఫ్లిప్‌కార్ట్ లోని టీజర్ పేజీలో గెలాక్సీ ఎఫ్41 భారీ 6,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే ఉంటుందని చూపిస్తుంది.

Samsung Galaxy F41 India Launch Set for October 8
Author
Hyderabad, First Published Sep 24, 2020, 6:56 PM IST

శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్ 41 అక్టోబర్ 8న భారతదేశంలో లాంచ్ అవుతుంది. శామ్సంగ్ కొత్తగా ప్రకటించిన ‘ఎఫ్ సిరీస్’ లో ఈ ఫోన్ మొదటిది. ఫోన్ కోసం ఫ్లిప్‌కార్ట్ లోని టీజర్ పేజీలో గెలాక్సీ ఎఫ్41 భారీ 6,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే ఉంటుందని చూపిస్తుంది.

అంతేకాకుండా కొన్ని ఇతర వివరాలను కూడా పేర్కొంది. ఫ్లిప్‌కార్ట్‌లోని టీజర్ పేజీ ప్రకారం అక్టోబర్ 8న సాయంత్రం 5:30 గంటలకు సామ్‌సంగ్ గెలాక్సీ ఎఫ్41 ను ఆవిష్కరిస్తుంది. 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, సూపర్ అమోలెడ్ ఇన్ఫినిటీ-యు డిస్‌ప్లే, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

also read  స్మార్ట్ యాప్‌లతో ట్రీవ్యూ ఎల్‌ఈడీ టీవీలు.. తక్కువ ధరకే.. ...

కొన్ని ఇతర నివేదికల ప్రకారం  6జి‌బి ర్యామ్, అండ్రాయిడ్ 10తో రాబోతున్నట్లు తెలుస్తుంది. ట్విట్టర్‌లో తెలిసిన సమాచారం ప్రకారం శామ్‌సంగ్ గెలాక్సీ ఎఫ్ 41 లో యుఎస్‌బి టైప్-సి పోర్ట్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, సింగిల్ బాటమ్ ఫైరింగ్ స్పీకర్,  ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్  ఇస్తుందని, రెండు ర్యామ్ ఇంకా స్టోరేజ్ కాన్ఫిగరేషన్లలో అందించబడుతుందని తెలిపింది.

గెలాక్సీ ఎఫ్ 41 బ్లాక్, బ్లూ మరియు గ్రీన్ అనే మూడు కలర్ ఆప్షన్లలో వస్తుంది. ఎఫ్ సిరీస్ ఫోన్‌ల ధర రూ. 15,000 నుంచి రూ. 20,000 వరకు ఉండొచ్చు అని భావిస్తున్నారు. ప్రస్తుతానికి శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్ 41 ధరల వివరాలను అధికారికంగా వెల్లడించలేదు.

Follow Us:
Download App:
  • android
  • ios