అప్పుడు ఆటకి గుడ్ బై చెబుతా... యువరాజ్ సింగ్

By ramya neerukondaFirst Published Jan 7, 2019, 1:58 PM IST
Highlights

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ లో ఆడటానికి తాను కృషి చేస్తున్నానని టీంఇండియా వెటరన్ క్రికెటర్ యువారజ్ సింగ్ తెలిపారు.

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ లో ఆడటానికి తాను కృషి చేస్తున్నానని టీంఇండియా వెటరన్ క్రికెటర్ యువారజ్ సింగ్ తెలిపారు.  కచ్చితంగా తాను ఐసీసీ వరల్డ్ కప్ లో చోటు దక్కించుకుంటానని యువరాజ్ ధీమా వ్యక్తం చేశారు. 2019లో యువరాజ్.. క్రికెట్ కి గుడ్ బై చెప్పనున్నారని గత కొంతకాలంగా వార్తలు వినపడుతున్నాయి. కాగా.. వాటిపై ఆయన స్పందించారు.

‘క్రికెట్‌ నాకన్నీ ఇచ్చింది.  ఆటకు వీడ్కోలు పలికేటప్పుడు అత్యుత్తమంగా ఉండాలని కోరుకుంటున్నా. బాధతో వెళ్లిపోవద్దు. ప్రస్తుతం రంజీ ట్రోఫీ ఆడుతున్నా. రంజీ ట్రోఫీ తర్వాత జాతీయ టీ20 టోర్నీ, ఐపీఎల్‌ ఉన్నాయి. మంచి జరుగుతుందని ఆశిస్తున్నా. నేను సత్తా చాటడానికి ఈ టోర్నీలు ఉపయోగపడతాయనే భావిస్తున్నా’ అని యువరాజ్ చెప్పారు.

మరొకవైపు ఆస్ట్రేలియాలో  టీమిండియా ప్రదర్శనపై యువీ ప్రశంసలు కురిపించాడు. ‘టీమిండియా బ్యాటింగ్‌ గతంలో కన్నా మెరుగ్గా ఉంది. ఆటగాళ్లంతా బాగా కష్టపడుతున్నారు. ముఖ్యంగా పుజారా, కోహ్లి, బుమ్రాలు రాణిస్తున్నారు. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో దిగువన వచ్చి రిషభ్‌ పంత్‌ పరుగులు చేయడం బాగుంది. దాంతోనే ఆసీస్‌ను వారి గడ్డపై ఓడించ గల్గుతున‍్నాం. అక్కడ గెలవడం అంత సులభం కాదు. గతేడాది రిషభ్‌  టీమిండియాకు ఎంపికయ్యాడు. అతడు ఎక్కువ షాట్లు ఆడతాడని, నిర్లక్ష్యంగా బాదేస్తాడని, ఆలోచించలేడని అన్నారు. ఐపీఎల్‌లో రాణించి టీమిండియాకు ఎంపికైన ఏడాదిలోనే విదేశాల్లో రెండు శతకాలు బాదేశాడు’ అని యువీ అన్నాడు.

click me!