నెం.4 బ్యాట్స్ మెన్ అవసరమే లేదు.. యూవీ షాకింగ్ కామెంట్స్

By telugu teamFirst Published Oct 1, 2019, 11:04 AM IST
Highlights

టీం ఇండియా జట్టులో నెం.4 బ్యాట్స్ మెన్ ఎవరు అనేదానిపై ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ప్రపంచకప్ కి ముందే దీనిపై క్లారిటీ వస్తుందని అందరూ భావించారు. కానీ బీసీసీఐ మాత్రం దీనిపై క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా ఈ విషయంపై హర్భజన్ సింగ్ స్పందించాడు. 

టీం ఇండియా జట్టుకి అసలు నెం.4 బ్యాట్స్ మెన్ అవసరమే లేదని... టాప్ ఆర్డర్ చాలా బలంగా ఉందంటూ యూవీ షాకింగ్ కామెంట్స్ చేశారు. నిజానికి నాలుగో స్థానంలో ఎవరు బ్యాటింగ్ చేయాలి అనే విషయంపై గత కొంతకాలంగా చర్చ జరుగుతోంది. తాజాగా ఈ విషయంపై హర్భజన్ సింగ్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించగా... దానికి యూవీ ఈ విధంగా స్పందించాడు.

ఇంతకీ మ్యాటరేంటంటే... టీం ఇండియా జట్టులో నెం.4 బ్యాట్స్ మెన్ ఎవరు అనేదానిపై ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ప్రపంచకప్ కి ముందే దీనిపై క్లారిటీ వస్తుందని అందరూ భావించారు. కానీ బీసీసీఐ మాత్రం దీనిపై క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా ఈ విషయంపై హర్భజన్ సింగ్ స్పందించాడు. 

విజయ్ హజారే ట్రోఫీలో యువ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ గొప్పగా రాణిస్తున్నాడు. అయితే అతన్ని టీం ఇండియాలో నాలుగో స్థానంలో ఎందుకు తీసుకోవడం లేదు అని హర్భజన్ సింగ్ ట్వీట్ చేశాడు. ‘‘దేశవాళీ క్రికెట్‌లో ఇన్ని పరుగులు చేస్తున్నా.. సూర్యకుమార్‌ని జట్టులోకి ఎందుకు తీసుకోవడంలేదో నాకు అర్థం కావడం లేదు. సూర్యకుమార్ కష్టపడు.. నీకు టైం వస్తుంది’’ అంటూ హర్భజన్ ట్వీట్ చేశారు. 

అయితే దీనిపై యువరాజ్ స్పందించాడు. ‘‘యార్ నీకు ముందే చెప్పాను! వాళ్లకి నెం.4 అవసరం లేదు.. టాప్ ఆర్డర్ చాలా బలంగా ఉంది’’ అని యువరాజ్ రిప్లే పెట్టాడు. యూవీ వెటకారంగా ఈ కామెంట్స్ చేశాడన్న విషయం అందరికీ అర్థమౌతోంది. మరీ ఇప్పటికైనా బీసీసీఐ ఈ విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుందేమో చూద్దాం..
 

click me!