సింధూ రిటైర్మెంట్ ట్వీట్ : చిన్నపాటి షాకిచ్చావ్ అంటూ రిజిజు రీ ట్వీట్..

By AN TeluguFirst Published Nov 3, 2020, 12:00 PM IST
Highlights

బ్యాండ్మింటన్ స్టార్ పీవీ సింధూ రిటైర్మెంట్ అంటూ సోమవారం సోషల్ మీడియాలో పోస్టైన ఓ వార్త సంచలనమే లేపింది.  దీన్ని నెటిజన్లు, మీడియా అసలు విషయం తెలుసుకోకుండా కథనాలు ప్రసారం చేశాయి. దీంతో అందరూ ఇదే నిజమని నమ్మారు. దీనిమీద కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు.. సింధు ట్వీట్ ను రీ ట్వీట్ చేశారు.

ఆమె పోస్టుతోనే చిన్నపాటి షాకిచ్చారని చెప్పుకొచ్చారు. కానీ సింధూ సంకల్ప బలంపై తనకు బాగా నమ్మకం ఉందని, దేశానికి మరిన్ని పతకాలు సాధించి, దేశ ప్రతిష్టను పెంచే శక్తి సామర్థ్యాలు ఆమెకు ఉన్నాయని రిజీజు చెప్పుకొచ్చారు. 

సింధు తన ట్విట్టర్, ఇన్ స్ట్రా గ్రామ్ లో చేసిన ఓ పోస్ట్ ఈ అయోమయానికి దారి తీసింది. ‘కరోనా మహమ్మారి నా కళ్లు తెరిపించింది. మ్యాచ్ లో చివరి షాట్ వరకు ప్రత్యర్థులతో హోరాహోరీగా పోరాడేలా శిక్షణ పొందాను. ఇంతకుముందు, ఇకమీదట కూడా పోరాడతా. కానీ కంటికి కనిపించని వైరస్ తో పోరడడం ఎలా? నెలల తరబడి ఇంట్లో ఉంటూ బయటికి అడుగుపెట్టిన ప్రతీసారి ఇదేప్రశ్న వేధిస్తోంది. కరోనా మిగిల్చిన హృదయ విదారక కథనాలు నన్ను ప్రశ్నించుకునేలా చేశాయి. 

డెన్మార్క్ ఓపెన్ లో పాల్గొనకపోవడం కరోనా విషాదాల్లో చివరిది కావాలి. అశాంతి, ప్రతికూలతలు, భయాందోళనలు, అనిశ్చితి నుంచి ఈ రోజే రిటైరవ్వాలనుకుంటున్న. ముఖ్యంగా అపరిశుభ్ర వాతావరణం, వైరస్ విషయంలో జాగ్రత్తలేని మన వైఖరి నుంచి రిటైరవ్వాలనుకుంటున్నా. మనమంతా కలిసి వైరస్ ను ఓడించాలి. రిటైర్మెంట్ అంటూ మీ అందరికీ చిన్నపాటి గుండెపోటు తెప్పించుంటా.. అయితే అందరినీ ఆలోచింపజేయాలన్నదే నా ప్రయత్నం.. డెన్మార్క్ ఓపెన్ లో పాల్గొనకలేకపోయి ఉండొచ్చు. కానీ ప్రాక్టీస్ చేయకుండా ఆగలేదు. ఆసియా ఓపెన్ కు సిద్ధంగా ఉన్నా. పోరాడకుండా మధ్యలో వదిలేయడం నాకిష్టం ఉండదు అని అసలు విషయం చెప్పింది. 

click me!