2019 ప్రపంచకప్‌లో .. కోహ్లీ పక్కన ధోనీ ఉంటేనే: సునీల్ గావస్కర్

By sivanagaprasad kodatiFirst Published Oct 30, 2018, 1:04 PM IST
Highlights

భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ 2019 ప్రపంచకప్ కోసం టీమిండియా కూర్పుపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 2019 వరల్డ్‌కప్‌లో ధోనీ అవసరం కోహ్లీకి చాలా ఉందని అభిప్రాయపడ్డారు. 

భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ 2019 ప్రపంచకప్ కోసం టీమిండియా కూర్పుపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 2019 వరల్డ్‌కప్‌లో ధోనీ అవసరం కోహ్లీకి చాలా ఉందని అభిప్రాయపడ్డారు. క్రికెటర్‌గా, కెప్టెన్‌గా ధోనీ అనుభవం విరాట్‌కు మేలు చేస్తుందన్నారు.

50 ఓవర్ల పాటు ధోనీ నుంచి ఎన్నో కొత్త విషయాలను కోహ్లీ తెలుసుకునే వీలు కలుగుతుందని.. అలాగే ఫీల్డింగ్ ఎలా మోహరించాలి.. క్రీజులో వున్న బ్యాట్స్‌మెన్‌కు అనుగుణంగా అప్పటికప్పుడు వ్యూహాలు మార్చాలన్న దానిపై ధోనీ సూచనలు ఉపకరిస్తాయని సునీల్ వ్యాఖ్యానించాడు.

బౌలర్లు బౌలింగ్ ఎలా వేయాలి.. ఎక్కడ వేయాలన్న దానిపైనా అతనికి అనుభవం ఉందన్నాడు. మరోవైపు వెస్టిండీస్‌, ఆస్ట్రేలియాలతో జరిగే టీ20 సిరీస్‌‌లకు ధోనీకి సెలెక్టర్లు విశ్రాంతినిచ్చారు. అలాగే విండీస్‌తో జరిగే టీ20 సిరీస్‌కు కెప్టెన్‌గా రోహిత్ శర్మ వ్యవహరిస్తాడు.

ధోనీ స్థానంలో రిషబ్ పంత్‌ను కీపర్‌గా తీసుకోవడంపై బీసీసీఐ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ స్పందిస్తూ.. మహేంద్రుడు పరిమిత ఓవర్ల క్రికెట్ నుంచి వైదొలగడని.. అలాగే అతన్ని తప్పించే ఉద్దేశ్యం కూడా తమకు లేదని స్పష్టం చేశారు. ఈ మార్పు కేవలం భవిష్యత్తులో వికెట్ కీపర్ల కోసమేనని.. ఇది ధోనీ శకానికి ముగింపు కాదని వెల్లడించారు.

టీ20 ఫార్మాట్లు ప్రారంభమైనప్పటి నుంచి.. ఎంఎస్ ధోనీ తన కెరీర్‌లో మొత్తం 104 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.. ఇందులో టీమిండియా ఆడినవి 93 మ్యాచ్‌లు. 2007లో తొలి టీ20 ప్రపంచకప్‌ను ధోనీ సారథ్యంలోని భారత జట్టు కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఆ అనుమానాలు ఇప్పుడు లేవు.. రాయుడిపై రోహిత్

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సానియా.. షోయబ్ ట్వీట్

కాల్పుల కేసులో శ్రీలంక మాజీ కెప్టెన్ అరెస్ట్...

ఒకే మ్యాచ్‌లో రెండు రికార్డులు బద్దలుగొట్టిన రోహిత్....రెండూ సచిన్‌వే

ధావన్‌ను ఔట్ చేసి అతడి స్టైల్లోనే విండీస్ బౌలర్ సెలబ్రేషన్...

కోహ్లీకి అక్తర్ 120 సెంచరీల టార్గెట్

అలిగిన వార్నర్.. మ్యాచ్ మధ్యలో నుంచే వెళ్లిపోయాడు

సెలక్షన్ కమిటీ పై మండిపడుతున్న ధోని ఫ్యాన్స్
 

click me!