ధోనీలా ఎవరూ అర్థం చేసుకోలేరు.. చాహల్

By telugu teamFirst Published May 15, 2019, 12:51 PM IST
Highlights

టీం ఇండియా మాజీ కెప్టెన్, కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ పై యువ క్రికెటర్ యజువేంద్ర చాహల్ ప్రశంసల వర్షం కురిపించాడు. ధోనీలాగా మ్యాచ్ ని అర్థం చేసుకుని ఆడేవాళ్లు ఎవరూ లేరని చాహల్ అభిప్రాయపడ్డాడు.

టీం ఇండియా మాజీ కెప్టెన్, కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ పై యువ క్రికెటర్ యజువేంద్ర చాహల్ ప్రశంసల వర్షం కురిపించాడు. ధోనీలాగా మ్యాచ్ ని అర్థం చేసుకుని ఆడేవాళ్లు ఎవరూ లేరని చాహల్ అభిప్రాయపడ్డాడు.గురుగ్రామ్‌లో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చాహల్ మీడియాతో మాట్లాడు. ఈ సందర్భంగా చాహల్ ధోనీ పై ప్రశంసలు కురిపించాడు.

 ‘వికెట్ల వెనుక ధోనీ లాంటి వ్యక్తి ఉంటడం జట్టుకు ప్లస్ పాయింట్. ధోనీ కారణంగానే వచ్చే ప్రపంచ కప్‌లో భారత జట్టుపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. సాధారణంగా నేను తొమ్మిదో లేక పదో ఓవర్‌లో బౌలింగ్‌కు వస్తాను. అప్పటికే పిచ్ పరిస్థితులను అంచనా వేసిన ధోనీ నాకు సలహాలు ఇస్తాడు. వాటితో మంచి ఫలితాలు రాబట్టవచ్చు. కోహ్లీ ఫీల్డింగ్ విషయంలో సహకారంతో పాటు సలహాలు ఇవ్వడం కలిసొస్తుంది. ఓ బ్యాట్స్‌మెన్‌ను ఔట్ చేయాలంటే ఎలాంటి బంతులు సంధించాలో ఆలోచిస్తాను. అశిష్ నెహ్రా, రోహిత్ శర్మ కూడా ఆటలో నాతో విలువైన విషయాలు షేర్ చేసుకుంటారని’ చాహల్ వివరించాడు. 

click me!