ఒకే మ్యాచ్ లో పది వికెట్లు తీసిన భారత బౌలర్

First Published Jul 2, 2018, 5:41 PM IST
Highlights

ఇంగ్లాండ్ వేదికపై సత్తాచాటిన భారత యువ బౌలర్...

క్రికెట్ మ్యాచుల్లో బౌలర్లు విజృంబించి ఆడటాన్ని చూస్తుంటాం. మంచి ఫామ్ లో ఉన్న బౌలర్ అయినా, ఎంత చక్కగా బౌలింగ్ చేసినా ఐదు లేదా ఆరు వికెట్లు తీయడానికి తెగ కష్టపడిపోతారు. అలాంటిది ఒకే బౌలర్ పది వికెట్లు తీస్తే...అది ప్రభంజనమే. కానీ ఆ అసాధ్యాన్ని కొందరు టాప్ బౌలర్లు మాత్రమే సుసాధ్యం చేశారు. తాజాగా రంజీ టీం కు చెందిన  ఓ భారత యువ బౌలర్ విదేశీ గడ్డపై ఈ ఘనత సాధించాడు.

రంజీల్లో విధర్భ తరపున ప్రాతినిధ్యం వహించే శ్రీకాంత్ వాఘ్ అనే ఫేస్ బౌలర్ ఈ ఘనత సాధించాడు. ఇంగ్లడ్ లో జరుగుతున్న నార్త్‌ యార్క్‌షైర్‌ సౌత్‌ దుర్హామ్‌(ఎన్‌వైఎస్‌డీ) క్రికెట్ లీగ్ లో శ్రీకాంత్ స్టోక్స్ స్లే క్రికెట్ క్లబ్ తరపున ఆడుతున్నాడు. మిడిల్స్ బ్రాగ్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో 11.4 ఓవర్లు వేసిన శ్రీకాంత్ 39 పరుగులిచ్చి పదికి పది వికెట్లు పడగొట్టాడు. దీంతో శ్రీకాంత్ చాలా మంది టాప్ బౌలర్లకు సాధ్యం కాని అరుదైన రికార్డును సాధించాడు.

గతంలో ఇలా ఓ టెస్ట్ మ్యాచ్ లో ఒకే ఇన్నింగ్స్ లో 10 వికెట్లు తీసి అనిల్ కుంబ్లే రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఇలా పది వికెట్లు తీసిన బౌలర్లు వరల్డ్ క్రికెట్ లో కూడా చాలా తక్కువమందే ఉన్నారు.  చక్కటి బౌలింగ్ ప్రదర్శనతో శ్రీకాంత్ వాఘె దిగ్గజ బౌలర్ల సరసన స్థానం సంపాదించి వారి చేతే శభాష్ అనిపించుకున్నాడు. 

click me!