టోక్యో పారాఒలంపిక్స్.. స్వర్ణం గెలిచిన అవనీ, యోగేశ్ రజతం..!

By telugu news teamFirst Published Aug 30, 2021, 9:15 AM IST
Highlights

మహిళల పది మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో ఇండియన్ షూటర్ అవనీ లేఖరా మంచి ప్రదర్శన చూపారు. ఫైనల్‌లో అద్భుత విజయం సాధించి, భారత్‌కు బంగారు పతకాన్ని అందించారు. 

ఇటీవల జరిగిన టోక్యో ఒలంపిక్స్ లో భారత ఆటగాళ్లు అదరగొట్టారు. అదే జోరును టోక్యో పారా ఒలంపిక్స్ లో భారత క్రీడాకారులు కొనసాగిస్తుండటం విశేషం.  పారా ఒలంపిక్స్ లో భారత్ పతకాల వేట కొనసాగుతోంది. తాజాగా.. ఈ ఒలంపిక్స్ లో భారత్ కి స్వర్ణం దక్కింది. మహిళల పది మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో ఇండియన్ షూటర్ అవనీ లేఖరా మంచి ప్రదర్శన చూపారు. ఫైనల్‌లో అద్భుత విజయం సాధించి, భారత్‌కు బంగారు పతకాన్ని అందించారు. 

ఫైనల్‌లో అవనీ లేఖరా... 249.6 రికార్డు స్కోరుతో బంగారు పతకం దక్కించుకోగా, చైనాకు చెందిన కుయ్‌పింగ్ ఝాంగ్ 248.9 స్కోరుతో రజత పతకాన్ని గెలుచుకున్నారు. ఉక్రెయిన్‌కి చెందిన ఇరినా షెత్నిక్ 227.5 స్కోరుతో తో కాంస్య పతకం దక్కించుకున్నారు. కాగా పారాఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ దక్కించుకున్న మొదటి భారతీయురాలిగా అవనీ లేఖరా రికార్డ్ నెలకొల్పారు. 

కాగా.. ఇక పురుషుల విభాగంలో భారత పారా అథ్లెట్ యోగేశ్ కతునియా డిస్కస్ త్రోలో రజతం సాధించాడు. టోక్యో పారా ఒలంపిక్స్  పరుషుల డిస్కస్ త్రో విభాగంలో.. ఈ పతకం సాధించడం గమనార్హం. 44.38మీటర్ల దూరంలో డిస్క్ త్రో చేసి.. పతకం సాధంచాడు.  ఆదివారం భారత్ ఓ రజతం, ఓ కాంస్యం సాధించగా.. తాజాగా.. భారత్ ఖాతాలో స్వర్ణం, రజతం వచ్చి చేరడం విశేషం.

యోగేశ్ కతునియా తండ్రి ఓ ఆర్మీ అధికారి. కాగా.. ఎనిమిదేళ్ల వయసులో కతునియా పక్షవాతానికి గురయ్యాడు.  కాగా.. ఈ ఒలంపిక్స్ లో బ్రెజిల్ క్రీడాకారుడు.. క్లాడినీ బాటిస్టా డోస్ శాంటోస్ 45.59 మీటర్ల ఉత్తమ త్రోతో స్వర్ణం గెలుచుకోగా, క్యూబాకు చెందిన లియోనార్డో డియాజ్ అల్డానా (43.36 మీటర్లు) కాంస్యం సాధించాడు.

click me!