ఐపీఎల్ 2024 ఆరెంజ్ క్యాప్ విన్నర్ రేసులో విరాట్ కోహ్లీ.. ఇప్ప‌టివ‌ర‌కు విజేత‌లు వీరే

By Mahesh Rajamoni  |  First Published May 18, 2024, 10:06 PM IST

Virat Kohli : ఐపీఎల్ 2024 లో విరాట్ కోహ్లీ ప‌రుగులు వ‌ర‌ద పారిస్తున్నాడు. ఈ క్ర‌మంలోనే ఐపీఎల్ లో 8000 ప‌రుగులు పూర్తి చేసిన తొలి ప్లేయ‌ర్ గా ఘ‌న‌త సాధించాడు. అలాగే, ప్ర‌స్తుతం సీజ‌న్ ఆరెంజ్ క్యాప్ విన్న‌ర్ రేసులో ముందున్నాడు.
 


IPL 2024 - Virat Kohli :  ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ లోనూ కింగ్ కోహ్లీ ప‌రుగులు సునామీ సృష్టిస్తున్నాడు. ప్ర‌స్తుతం సీజ‌న్ లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ప్లేయ‌ర్ గా ఆరెంజ్ క్యాప్ ను సొంతం చేసుకున్న ప్లేయ‌ర్ గా ఉన్నాడు. ఐపీఎల్ 2024 సీజ‌న్ ఆరెంజ్ క్యాప్ విన్న‌ర్ రేసులోనూ అంద‌రికంటే ముందున్నాడు. ఎందుకంటే ఇప్ప‌టికే విరాట్ కోహ్లీ 700+ ప‌రుగులు పూర్తి  చేశాడు. అరెంజ్ క్యాప్ టాప్-5 లిస్టులో ఉన్న ప్లేయ‌ర్లు ఎవ‌రు కూడా ఇంకా 500+ ప‌రుగుల వ‌ద్ద మాత్ర‌మే ఉన్నారు. శనివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో తప్పక గెలవాల్సిన పోరులో 47 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో తన ఆధిక్యాన్ని మ‌రింత‌ పెంచుకున్నాడు.

ప్ర‌స్తుత సీజ‌న్ లో అత్య‌ధిక ప‌రుగులు - టాప్-5 ప్లేయ‌ర్లు (18-05-2024 నాటికి)

Latest Videos

1. విరాట్ కోహ్లీ - 708
2. రుతురాజ్ గైక్వాడ్ - 541
3. ట్రావిస్ హెడ్ - 533
4. రియాన్ పరాగ్ - 531
5.  సాయి సుదర్శన్ - 527

గత సీజన్‌లో ప్రస్తుత గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 890 పరుగులతో ఆరెంజ్ క్యాప్‌ను గెలుచుకున్నాడు. గిల్ త‌ర్వాత  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు  కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ 730 పరుగులు, చెన్నై సూపర్ కింగ్స్  ప్లేయ‌ర్ డెవాన్ కాన్వే 672 పరుగులతో ఉన్నారు. విరాట్ కోహ్లీ  639 ప‌రుగుల‌తో 4వ స్థానంలో, యశస్వి జైస్వాల్ 625 ప‌రుగుల‌తో 5వ స్థానంలో నిలిచారు.

ఐపీఎల్ లో ఇప్ప‌టివ‌ర‌కు ఆరెంజ్ క్యాప్ విజేత‌లు వీరే.. 

ఐపీఎల్ 2023 ఆరెంజ్ క్యాప్ విజేత: శుభ్ మ‌న్ గిల్
మొత్తం పరుగులు: 890 | జట్టు: గుజరాత్ టైటాన్స్

ఐపీఎల్ 2022 ఆరెంజ్ క్యాప్ విజేత: జోస్ బట్లర్
మొత్తం పరుగులు: 863 | జట్టు:  రాజస్థాన్ రాయల్స్

ఐపీఎల్ 2021 ఆరెంజ్ క్యాప్ విజేత: రుతురాజ్ గైక్వాడ్
మొత్తం పరుగులు: 635 | జట్టు: చెన్నై సూపర్ కింగ్స్

ఐపీఎల్ 2020 ఆరెంజ్ క్యాప్ విజేత: కేఎల్ రాహుల్
మొత్తం పరుగులు: 670 | జట్టు: కింగ్స్ ఎలెవన్ పంజాబ్

ఐపీఎల్ 2019 ఆరెంజ్ క్యాప్ విజేత: డేవిడ్ వార్నర్
మొత్తం పరుగులు: 692 | జట్టు:  సన్‌రైజర్స్ హైదరాబాద్

ఐపీఎల్ 2018 ఆరెంజ్ క్యాప్ విజేత: కేన్ విలియమ్సన్
మొత్తం పరుగులు: 735 | జట్టు: సన్‌రైజర్స్ హైదరాబాద్

ఐపీఎల్ 2017 ఆరెంజ్ క్యాప్ విజేత: డేవిడ్ వార్నర్
మొత్తం పరుగులు: 641 | జట్టు: సన్‌రైజర్స్ హైదరాబాద్

ఐపీఎల్ 2016 ఆరెంజ్ క్యాప్ విజేత: విరాట్ కోహ్లీ
మొత్తం పరుగులు: 973 | జట్టు: రాయల్ ఛాలెంజర్స్  బెంగళూరు

ఐపీఎల్ 2015 ఆరెంజ్ క్యాప్ విజేత: డేవిడ్ వార్నర్
మొత్తం పరుగులు: 562 | జట్టు: సన్‌రైజర్స్ హైదరాబాద్

ఐపీఎల్ 2014 ఆరెంజ్ క్యాప్ విజేత: రాబిన్ ఉతప్ప
మొత్తం పరుగులు: 660 | జట్టు:  కోల్‌కతా నైట్ రైడర్స్

ఐపీఎల్ 2013 ఆరెంజ్ క్యాప్ విజేత: మైఖేల్ హస్సీ
మొత్తం పరుగులు: 733 | జట్టు: చెన్నై సూపర్ కింగ్స్

ఐపీఎల్ 2012 ఆరెంజ్ క్యాప్ విజేత: క్రిస్ గేల్
మొత్తం పరుగులు: 733 | జట్టు: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

ఐపీఎల్ 2011 ఆరెంజ్ క్యాప్ విజేత: క్రిస్ గేల్
మొత్తం పరుగులు: 608 | జట్టు: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

ఐపీఎల్ 2010 ఆరెంజ్ క్యాప్ విజేత: సచిన్ టెండూల్కర్
మొత్తం పరుగులు: 618 | జట్టు:  ముంబై ఇండియన్స్

ఐపీఎల్ 2009 ఆరెంజ్ క్యాప్ విజేత: మాథ్యూ హేడెన్
మొత్తం పరుగులు: 572 | జట్టు: చెన్నై సూపర్ కింగ్స్

ఐపీఎల్ 2008 ఆరెంజ్ క్యాప్ విజేత: షాన్ మార్ష్
మొత్తం పరుగులు: 616 | జట్టు: కింగ్స్ ఎలెవన్ పంజాబ్

RCB VS CSK : చిన్న‌స్వామి స్టేడియంలో ప‌రుగుల వ‌ర‌ద.. విరాట్ కోహ్లీ స‌రికొత్త రికార్డు

click me!