బాహుబలి నీరజ్ కు స్పెషల్ గిప్ట్... రెడీగా వుంచాలని మహింద్రా సిబ్బందికి ఛైర్మన్ ఆదేశాలు

By Arun Kumar PFirst Published Aug 8, 2021, 9:39 AM IST
Highlights

యావత్ భారత ప్రజల కలను నెరవేరుస్తూ టోక్యో ఒలింపిక్స్2020లో గోల్డ్ మెడల్ సాధించిన నీరజ్ చోప్రాకు అదిరిపోయే గిప్ట్ ఇవ్వనున్నట్లు మహింద్రా ఆండ్ మహింద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహింద్రా ప్రకటించారు. 

టోక్యో ఒలింపిక్స్2020లో స్వర్ణం సాధించి భారత కీర్తిపతాకాన్ని ఎగరేసిన క్రీడాకారుడు నీరజ్ చోప్రాకు మహింద్రా ఆండ్ మహింద్రా గ్రూప్స్ ఛైర్మన్ ఆనంద్ మహింద్రా ప్రత్యేక గిప్ట్ ను సిద్దం చేస్తున్నారు. కొత్తగా మార్కెట్‌లోకి రాబోతున్న ఎక్స్‌యూవీ 700 మోడల్‌ వాహనాన్ని నీరజ్ చోప్రాకు బహుమతిగా ఇవ్వనున్నట్టు ఆనంద్ మహింద్రా ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.

భారత జావెలిన్ త్రో ప్లేయర్ నీరజ్ స్వర్ణ పతకాన్ని సాధించినట్లు తెలియగానే ఆనంద్ మహింద్రా ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ''మేమంతా నీ సైన్యమే బాహుబలి'' అంటూ నీరజ్, ప్రభాస్ బాహుబలి  ఫోటోను జతచేస్తూ మహింద్రా ట్వీట్ చేశారు. 

We’re all in your army, Baahubali pic.twitter.com/63ToCpX6pn

— anand mahindra (@anandmahindra)

 

ఇక ఓ నెటిజన్ నీరజ్ కు ఎక్స్‌యూవీ 700 గిప్ట్ గా ఇవ్వాలని ఆనంద్ మహింద్రాను కోరాడు. దీనిపై స్పందించిన ఆయన ''తప్పకుండా ఇస్తాను. మన గోల్టెన్ అథ్లెట్ కు(నీరజ్) కు గిప్ట్ ఇవ్వడం నా బాధ్యత... ఇలా చేయడం నాకు గర్వంగానూ వుంటుంది. దయచేసి ఒక ఎక్స్‌యూవీ 700 రెడీగా వుంచండి'' అని తన సంస్థకు చెందిన అధికారులను ఆనంద్ మహింద్రా ఆదేశించారు. 

read more  నా 37 ఏళ్ల కళను నిజం చేశావ్, థ్యాంక్యూ బిడ్డా!... పీటీ ఉషా ఎమోషనల్ ట్వీట్...

మరోవైపు ఒలింపిక్స్ లో స్వర్ణ పతకం సాధించిన తమ రాష్ట్రానికి చెందిన అథ్లెట్ నీరజ్ చోప్రాపై హర్యానా ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. నీరజ్ కు రూ.6 కోట్ల నగదు పారితోషికం ప్రకటించారు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టర్. అలాగే క్లాస్ 1 ప్రభుత్వ ఉద్యోగం, హర్యానాలో ఎక్కడ కావాలంటే అక్కడ 50 శాతం కంసెషన్‌తో ఫ్లాట్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. పంచ్‌కులాలో ఓ అథ్లెటిక్స్ సెంటర్ నిర్మించి ఇస్తామని సీఎం మనోహర్ లాల్ ప్రకటించారు. 

హర్యానాలోని పానిపట్ జిల్లా ఖాంద్రా గ్రామానికి చెందిన నీరజ్ చోప్రా 130 కోట్ల భారత ప్రజల బంగారు కలను నిజం చేశాడు. టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రో ఈవెంట్‌ ఫైనల్‌లో 87.58 మీటర్లు విసిరి స్వర్ణం సాధించి భారత ప్రజల సంబరాలకు కారణమయ్యాడు. 
 

click me!