ఐపీఎల్ నుండి సురేష్ రైనా అవుట్: కారణం ఇదే...!

By team teluguFirst Published Aug 31, 2020, 9:08 AM IST
Highlights

రైనా భారత్ ఎందుకు తిరిగి వచ్చాడని దానిపై అనేక వాదనలు వినిపించాయి. తొలుత తన బంధువుల్లో ఎవరో మరణించిన కారణంగా రైనా తిరిగి వచ్చేసాడు అని చెప్పినప్పటికీ... అది కాదనై ఆతరువాత తేలింది. ఎట్టకేలకు రైనా వెనక్కి రావడానికిగల కారణాలు బయటకు వచ్చాయి. 

ఐపీఎల్ నుండి సురేష్ రైనా నిష్క్రమణ అందరికి ఆశ్చర్యానికి గురిచేసింది. సురేష్ రైనా భారత్ తిరిగి చేరుకున్నది, మిగిలిన సీజన్ కి అందుబాటులో ఉండడని చెన్నై టీం అధికారికంగా ప్రకటించగానే.... ఒక్కసారిగా క్రికెట్ అభిమానుల్లో విస్మయం వ్యక్తమయింది. రైనా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు అనేది అందరి మెదళ్లలోనూ మెదులుతున్న ప్రశ్న. 

రైనా భారత్ ఎందుకు తిరిగి వచ్చాడని దానిపై అనేక వాదనలు వినిపించాయి. తొలుత తన బంధువుల్లో ఎవరో మరణించిన కారణంగా రైనా తిరిగి వచ్చేసాడు అని చెప్పినప్పటికీ... అది కాదనై ఆతరువాత తేలింది. ఎట్టకేలకు రైనా వెనక్కి రావడానికిగల కారణాలు బయటకు వచ్చాయి. 

రైనా కరోనా వైరస్ గురించి హైరానా పడ్డట్టుగా తెలియవస్తుంది. బబుల్ వాతావరణంలోనే ఉన్నప్పటికీ... టీం సభ్యుల్లో ఇద్దరు వైరస్ బారినపడటం రైనాను పునరాలోచనలో పడేలా చేసింది 

రైనాకు తన ఇద్దరు పిల్లలు గుర్తొచ్చి, ఆట కన్నా వారి జీవితమే తనకు ముఖ్యమనుకొనే ఇండియా తిరిగి వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. రైనా కు నాలుగు సంవత్సరాల కూతురు గ్రేషియా, 5 నెలల కొడుకు రివ్ ఉన్నారు. వీరిరువురు గురించి కనగారుపడ్డ సురేష్ రైనా టీం యాజమయంతో చర్చించి ఇండియా వచ్చేసినట్టు సమాచారం. 

బబుల్ పూర్తిగా సేఫ్ అని చెప్పినప్పటికీ.... అందులోనే ఇద్దరు ప్లేయర్స్ కి కరోనా రావడంపై ఆయన ఆయన ఆందోళన చెందినట్టు తెలియవస్తుంది. బయటకెక్కడికి వెళ్ళడానికి వీల్లేకుండా, రూమ్ లోనే ఉండాల్సి రావడం, మైదానంలోకి వెళ్లి బ్యాటు పట్టుకునే ఆస్కారం కూడా లేకపోవడం, హోటల్ కూడా ఊరవతల ఉండడం అన్నీ వెరసి రైనా ఆందోళన చెందడంతో ఇండియా తిరిగి వచ్చాడు. 

ధోనితో సహా చాలామంది క్రీడాకారులు రైనాకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ... రైనా మాత్రం ఆందోళనతోనే ఉన్నాడు. దీనితో రైనాను ఇక ఉంచినా ప్రయోజనం లేదని భావించి వెనక్కి పంపించేసినట్టు తెలియస్తుంది.

ప్రస్తుతం 14 రోజుల తప్పనిసరి క్వారంటైన్ నిబంధనను అనుసరించి, తన తల్లిదండ్రులతో ఘజియాబాద్ లో ఉంటున్నాడు. అతని కుటుంబం వసంత్ విహార్ లో నివాసం ఉంటుంది. 

click me!