అరంగేట్రంలో పృథ్వీ షా సెంచరీ.. అప్పుడే అంతొద్దన్న గంగూలీ

By sivanagaprasad kodatiFirst Published Oct 5, 2018, 1:08 PM IST
Highlights

అరంగేట్ర టెస్ట్‌లోనే సెంచరీ చేసి.. 59 ఏళ్ల రికార్డును తిరగరాసిన పృథ్వీషాపై క్రికెట్ ప్రపంచం ప్రశంసల జల్లు కురిపిస్తోంది. షా బ్యాటింగ్ చూస్తుంటే... సెహ్వాగ్, సచిన్‌లు గుర్తొస్తున్నారంటూ టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రితో పాటు అభిమానులు ఆకాశానికెత్తేస్తున్నారు

అరంగేట్ర టెస్ట్‌లోనే సెంచరీ చేసి.. 59 ఏళ్ల రికార్డును తిరగరాసిన పృథ్వీషాపై క్రికెట్ ప్రపంచం ప్రశంసల జల్లు కురిపిస్తోంది. షా బ్యాటింగ్ చూస్తుంటే... సెహ్వాగ్, సచిన్‌లు గుర్తొస్తున్నారంటూ టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రితో పాటు అభిమానులు ఆకాశానికెత్తేస్తున్నారు.

అయితే దీనిపై భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభ్యంతరం తెలిపాడు.. అప్పుడే షాను సచిన్, సెహ్వాగ్‌లతో పోల్చొద్దని విజ్ఞప్తి చేశాడు. ‘‘ సెహ్వాగ్ ఓ జీనియస్.. అతనితో షాను పోల్చకండి.. పృథ్వీని ప్రపంచం మొత్తం చుట్టిరానివ్వండి.. అతను ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికాల మీద కచ్చితంగా రాణిస్తాడన్నాడు..

అతనికిది ఓ అసాధారణమైన రోజు.. రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ అరంగేట్రం మ్యాచ్‌ల్లో సెంచరీ చేసిన షా... ఇప్పుడు టీమిండియా తరపున సెంచరీ చేయడం అసాధారణమే అని చెప్పుకొచ్చాడు. అయితే ‘‘ సానుకూల దృక్పథంతో కూడిన అతని బ్యాటింగ్ నైపుణ్యం అద్భుతం..

అండర్-19 వరల్డ్ కప్, వెస్టిండీస్‌తో తొలి టెస్ట్ మ్యాచ్ ఆడిన అతని ఆటకు చాలా వ్యత్యాసం ఉంది. షా దేశం తరపున చాలా రోజులు ఆడగలడనే నమ్మకం ఉంది. గురువారం అతను అద్భుతం సృష్టించాడు షాకు అభినందనలు అని గంగూలీ పేర్కొన్నాడు.

దాదా సైతం తన అరంగేట్రం మ్యాచ్‌లో సెంచరీ చేశాడు. 1996లో లార్డ్స్ లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ సాధించాడు. దీనిపై స్పందిస్తూ.. తాను ‘‘ రంజీ ట్రోఫీ అరంగేట్ర మ్యాచ్‌లో సెంచరీ చేయలేదని కానీ.. దులీప్ ట్రోఫీ తొలి మ్యాచ్‌లోనే శతకం సాధించానని గంగూలీ తెలిపాడు.

 

పృథ్వీ షా అద్భుత ప్రదర్శన.. మురిసిపోయిన రవిశాస్త్రి

ఇది తెలుసా.. పృథ్వీషా కెరీర్ టర్న్ అయ్యింది మన ఒంగోలులోనే

సెల్ఫీ కోసం దూసుకొచ్చిన అభిమానులు.. చెబితే వినరా అంటూ కోహ్లీ సీరియస్

నా సెంచరీ ఆయనకే అంకితం :పృథ్విషా

కనీసం నాకు చెప్పలేదు.. మురళీ విజయ్ ఆవేదన

సచిన్ కి దక్కని రికార్డ్ ని సొంతం చేసుకున్న పృథ్వీ షా

ఆసియా కప్ విశ్రాంతిపై క్లారిటీ ఇచ్చిన విరాట్ కోహ్లీ

విశాఖకు మారిన వేదిక: బిసిసిఐపై దుమ్మెత్తిపోసిన గంగూలీ

59 ఏళ్ల రికార్డు బద్ధలు.. అరంగేట్రంలోనే పృథ్వీషా ఘనత

click me!