పృథ్వీ షా అద్భుత ప్రదర్శన.. మురిసిపోయిన రవిశాస్త్రి

By sivanagaprasad kodatiFirst Published Oct 5, 2018, 12:41 PM IST
Highlights

అరంగేట్ర మ్యాచ్‌లోనే సెంచరీ చేసిన పృథ్వీ షాపై దేశం ప్రశంసల జల్లు కురిపిస్తోంది. మాజీ క్రికెట్ దిగ్గజాలు ఈ కుర్రాడి ఆటను చూసి ఆశ్చర్యపోతున్నారు. టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి అయితే షాను ఆకాశానికి ఎత్తేశాడు. 

అరంగేట్ర మ్యాచ్‌లోనే సెంచరీ చేసిన పృథ్వీ షాపై దేశం ప్రశంసల జల్లు కురిపిస్తోంది. మాజీ క్రికెట్ దిగ్గజాలు ఈ కుర్రాడి ఆటను చూసి ఆశ్చర్యపోతున్నారు. టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి అయితే షాను ఆకాశానికి ఎత్తేశాడు.

"నీలో కొంచెం సెహ్వాగ్.. కొంచెం సచిన్ కనిపిస్తున్నారు అద్భుతంగా ఆడావు.. తొలి మ్యాచ్ అయినా ఏ మాత్రం భయపడకుండా మంచి ప్రదర్శన చేశావని" ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. మరోవైపు నువ్వు ఇలా ప్రత్యర్థులపై దాడి చేస్తుంటే చూడ ముచ్చటగా ఉందని.. నీ ఆటను ఇలాగే కొనసాగించాలని’’ ఇండియన్ క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ట్వీట్ చేశారు.‘‘

"ఇప్పుడు ఇది ఆరంభం మాత్రమే.. ఈ కుర్రాడిలో ఇంకా చాలా దమ్ముంది’’ అని సెహ్వాగ్ కొనియాడాడు. భారత్ నుంచి మరో సూపర్‌స్టార్ వెలుగులోకి వచ్చాడని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ ప్రశంసించాడు. వీరితో పాటు భారత మాజీ క్రికెటర్లు మహ్మాద్ కైఫ్, హార్భజన్ సింగ్, వీవీఎస్ లక్ష్మణ్ షాకు అభినందనలు తెలిపిన వారిలో ఉన్నారు.

మరోవైపు తన ఆరాధ్య క్రికెటర్ సచిన్ నుంచి ప్రశంసలు రావడంతో పృథ్వీ షా ఎగిరిగంతేశాడు. సచిన్ తనను ప్రశంసించడం ఎంతో ఆనందంగా ఉందని షా తెలిపాడు. తనకు అభినందనలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపాడు. 

ఇది తెలుసా.. పృథ్వీషా కెరీర్ టర్న్ అయ్యింది మన ఒంగోలులోనే

సెల్ఫీ కోసం దూసుకొచ్చిన అభిమానులు.. చెబితే వినరా అంటూ కోహ్లీ సీరియస్

నా సెంచరీ ఆయనకే అంకితం :పృథ్విషా

కనీసం నాకు చెప్పలేదు.. మురళీ విజయ్ ఆవేదన

సచిన్ కి దక్కని రికార్డ్ ని సొంతం చేసుకున్న పృథ్వీ షా

ఆసియా కప్ విశ్రాంతిపై క్లారిటీ ఇచ్చిన విరాట్ కోహ్లీ

విశాఖకు మారిన వేదిక: బిసిసిఐపై దుమ్మెత్తిపోసిన గంగూలీ

59 ఏళ్ల రికార్డు బద్ధలు.. అరంగేట్రంలోనే పృథ్వీషా ఘనత

click me!