ఇది తెలుసా.. పృథ్వీషా కెరీర్ టర్న్ అయ్యింది మన ఒంగోలులోనే

By sivanagaprasad kodatiFirst Published Oct 5, 2018, 12:12 PM IST
Highlights

ప్రస్తుతం భారత క్రికెట్ అభిమానుల చర్చ అంతా ఒక్కరి గురించే.. ఆ ఒక్కరు ఎవరో కాదు.. అరంగేట్రం మ్యాచ్‌లోనే సెంచరీ చేసిన పృథ్వీ షా. రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా గురువారం వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో పృథ్వీ షా సెంచరీ చేశాడు..

ప్రస్తుతం భారత క్రికెట్ అభిమానుల చర్చ అంతా ఒక్కరి గురించే.. ఆ ఒక్కరు ఎవరో కాదు.. అరంగేట్రం మ్యాచ్‌లోనే సెంచరీ చేసిన పృథ్వీ షా. రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా గురువారం వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో పృథ్వీ షా సెంచరీ చేశాడు.. తద్వారా అరంగేట్రంలోనే సెంచరీ చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా షా రికార్డుల్లోకి ఎక్కాడు.

చక్కటి టైమింగ్‌తో పాటు షాట్లు కొడుతూ షా సెంచరీ పూర్తి చేశాడు. అయితే ఇతను ఈ స్థాయికి ఎదగడం వెనుక ఒంగోలులో చేసిన సెంచరీయే కారణం అంటున్నారు క్రీడా పండితులు.. 2017-18 సీజన్‌లో భాగంగా ఆంధ్రా, ముంబై జట్ల మధ్య ఒంగోలు శర్మా క్రికెట్ మైదానంలో మ్యాచ్ జరుగుతోంది.

అప్పటికే 14 ఏళ్ల వయసులో 330 బంతుల్లో 546 పరుగులు చేసిన షా గురించి తెలియడంతో ఆ కుర్రాడిని చూడటానికి అభిమానులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఓపెనర్‌గా దిగిన పృథ్వీషా.. విజయ్ కుమార్, బండారు అయ్యప్ప, భార్గవ్ భట్ లాంటి ఆంధ్రా బౌలర్లను తట్టుకుని తొలి రోజే సెంచరీ చేశాడు.

అయితే రెండో ఇన్నింగ్స్‌లో 21 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. ఇతని సత్తాను ప్రత్యక్షంగా తిలకించేందుకు జాతీయ సెలెక్టర్ శరణ్‌దీప్ సింగ్ వచ్చి ఉండటం.. పృథ్వీ ఆటకు ముగ్థుడవ్వడంతో అతడిని అండర్-19 జట్టుకు కెప్టెన్‌గా ఎంపిక చేయడం.. అనంతరం షా ట్రోఫీని అందుకోవడం.. జాతీయ జట్లులో స్థానం ఇలా అన్నింటికి ఒంగోలులో చేసిన సెంచరీనే కారణం. దీంతో నాటి స్మృతులను ప్రకాశం జిల్లా క్రికెట్ అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు.

సెల్ఫీ కోసం దూసుకొచ్చిన అభిమానులు.. చెబితే వినరా అంటూ కోహ్లీ సీరియస్

నా సెంచరీ ఆయనకే అంకితం :పృథ్విషా

కనీసం నాకు చెప్పలేదు.. మురళీ విజయ్ ఆవేదన

సచిన్ కి దక్కని రికార్డ్ ని సొంతం చేసుకున్న పృథ్వీ షా

ఆసియా కప్ విశ్రాంతిపై క్లారిటీ ఇచ్చిన విరాట్ కోహ్లీ

విశాఖకు మారిన వేదిక: బిసిసిఐపై దుమ్మెత్తిపోసిన గంగూలీ

59 ఏళ్ల రికార్డు బద్ధలు.. అరంగేట్రంలోనే పృథ్వీషా ఘనత

click me!