మహిళ అథ్లెట్లలో సింధు టాప్: కోహ్లీ ఆదాయంతో పోలిస్తే...

By pratap reddyFirst Published Aug 22, 2018, 5:16 PM IST
Highlights

భారత దేశంలోని మహిళా క్రీడాకారుల్లో అత్యధిక ఆదాయం పొందుతున్న క్రీడాకారిణి పివి సింధు. బ్యాడ్మింటన్ క్రీకాడాకారిణి అయిన సింధు ప్రపంచంలో ఏడో స్థానాన్ని సంపాదించుకుంది. ఆమె ఆదాయం 8.5 మిలియన్ డాలర్లు.

న్యూఢిల్లీ: భారత దేశంలోని మహిళా క్రీడాకారుల్లో అత్యధిక ఆదాయం పొందుతున్న క్రీడాకారిణి పివి సింధు. బ్యాడ్మింటన్ క్రీకాడాకారిణి అయిన సింధు ప్రపంచంలో ఏడో స్థానాన్ని సంపాదించుకుంది. ఆమె ఆదాయం 8.5 మిలియన్ డాలర్లు. 

విరాట్ కోహ్లీ ఆదాయంతో పోలిస్తే సింధు ఆదాయంపై పెదవి విరుపే మిగులుతుంది. కోహ్లీ ఆదాయం 24 మిలియన్ డాలర్లు. అంటే, కోహ్లీ ఆదాయంలో మూడో వంతు ఆదాయం మాత్రమే సింధుకు ఉంది. వేతనం, ఎండార్స్ మెంట్ల ద్వారా సింధు సంపాదిస్తున్న మొత్తం అది. 

ఫోర్బ్స్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం... సింధు ప్రైజ్ మనీ ద్వారా రూ.5 లక్షల డాలర్లు సంపాదిస్తుండగా, కోహ్లీ వేతనం, విన్నింగ్స్ ద్వారా 4 మిలియన్ డాలర్లు సంపాదిస్తున్నాడు. ఎండార్స్ మెంట్ల ద్వారా సింధు 8 మిలియన్ డాలర్లు సంపాదిస్తుండగా, కోహ్లీ 20 మిలియన్ డాలర్లు సంపాదిస్తున్నాడు. 

23 ఏళ్ల సింధు బ్రిడ్జ్ స్టోన్, గాటొరాడ్, నోకియా, పానాసోనిక్, రెకిట్ బెంకిస్టర్ వంటివాటికి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ న్యూ ఎరా, టిస్సోట్, ఉబర్, పూమా, కాల్గేట్ పామోలివ్, హెర్బలైఫ్, పెప్సీ వంటివాటికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. 

click me!