ఏషియన్ గేమ్స్: భారత్‌కు మరో సిల్వర్ మెడల్, మళ్లీ షూటింగ్‌లోనే

By Arun Kumar PFirst Published Aug 20, 2018, 4:26 PM IST
Highlights

భారత షూటర్లు ఇండోనేషియాలో జరుగుతున్న 2018 ఆసియా క్రీడల్లో చెలరేగిపోతున్నారు. షూటర్లు ఒకరి తర్వాత ఒకరు పతకాలను సాధిస్తూ దూసుకుపోతున్నారు. ఇప్పటివరకు ఇండియా సాధించిన నాలుగు పతకాల్లో మూడు షూటింగ్ విభాగం నుండే రావడం విశేషం.
 
పురుషుల ట్రాప్ ఈవెంట్ లో లక్షయ్ షెరాత్ అద్భుత ప్రదర్శన కనబర్చి రెండో స్థానంలో నిలిచాడు. ఇతడు ఫైనల్లో 48 టార్గెట్లకు గాను 42 టార్గెటలను ఫినిష్ చేశాడు. దీంతో రజత పతకం అతన్ని వరించింది. దీని ద్వారా ఇండియా పతకాల ఖాతా నాలుగుకి చేరుకుంది. 

ఈ ఆసియా క్రీడల్లో మొదటి రోజు 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో షూటర్లు అపూర్వి చండేలా, రవి కుమార్ కాంస్య పతకాన్ని సాధించారు. ఇక రెండో రోజైన ఇవాళ షూటర్ దీపక్ కుమార్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో తన అత్యుత్తమ ప్రదర్శనతో సిల్వర్ మెడల్ సాధించాడు. ఇలా ఇప్పటికే షూటింగ్ విభాగంలో రెండు పతకాలను తన ఖాతాలో వేసుకోగా తాజాగా మూడో పతకం కూడా ఇందులో చేరిపోయింది.

ఇక పురుషుల 65 కేజీల రెజ్లింగ్ విభాగంలో బజ్‌రంగ్ పూనియా పసిడి పతకం సాధించిన విషయం తెలిసిందే. తాజాగా వినేష్ ఫోగట్ 60కేజీల ఫ్రీస్టైల్ రెజ్లిగ్ విభాగంలో ఫైనల్ కు చేరి మరో పతకాన్ని ఖాయం చేసింది.

click me!