ranji trophy2022: ఇండియన్ క్రికెట్‌కు గుడ్ న్యూస్! రంజీ ట్రోఫీని నిర్వహించెందుకు బీసీసీఐ కొత్త ప్లాన్‌..

By asianet news teluguFirst Published Jan 28, 2022, 2:08 AM IST
Highlights

కరోనావైరస్  కొత్త వేరియంట్ ఓమిక్రాన్ కారణంగా నిరవధికంగా వాయిదా పడిన రంజీ ట్రోఫీ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కొత్త ప్రణాళికను రూపొందించింది. ఇందుకు అతిపెద్ద దేశీయ టోర్నీని రెండు దశల్లో నిర్వహించాలని బోర్డు  యోచిస్తుంది.

కరోనావైరస్  కొత్త వేరియంట్ ఓమిక్రాన్ కారణంగా నిరవధికంగా వాయిదా పడిన రంజీ ట్రోఫీ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కొత్త ప్రణాళికను రూపొందించింది. ఇందులో భాగంగా అతిపెద్ద దేశీయ టోర్నీని రెండు దశల్లో నిర్వహించాలని బోర్డు యోచిస్తోంది. దీనికి సంభందించిన  సమాచారాన్ని బోర్డు కోశాధికారి అరుణ్ ధుమాల్ గురువారం (జనవరి 27) తెలిపారు. అయితే జనవరి 13 నుంచి రంజీ ట్రోఫీ జరగాల్సి ఉండగా, కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ టోర్నీలో మొత్తం 38 జట్లు పాల్గొననున్నాయి. 

మరోవైపు ఐపీఎల్ కారణంగా ఈ రంజీ ట్రోఫీని రెండు దశల్లో నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. నిజానికి మార్చి 27 నుంచి ఐపీఎల్ 15వ సీజన్‌ను ప్రారంభించాలని బోర్డు యోచిస్తోంది. ఫిబ్రవరి 20న దీని అధికారిక ప్రకటన వెలువడనుంది. ఐపీఎల్ కారణంగా రంజీ ట్రోఫీ నిర్వహించడం ఒక దశలో కష్టమే. ఐపీఎల్ ప్రారంభానికి ముందు కొన్ని మ్యాచ్‌లు, ఐపీఎల్ తర్వాత చివరి మ్యాచ్‌లు నిర్వహించాలని బోర్డు భావిస్తోంది. టోర్నీ నిర్వహించేందుకు  అన్ని అవకాశాలను అన్వేషిస్తున్నామని అరుణ్ ధుమాల్ తెలిపారు.

అరుణ్ ధుమాల్ ఏం చెప్పారంటే ?
అరుణ్ ధుమాల్ మాట్లాడుతూ, “మేము రంజీ ట్రోఫీని నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నాము. కొంతకాలంగా కరోనా కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. గత కొద్ది రోజులుగా కేసులు తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది. రంజీ ట్రోఫీ ఆపరేషన్స్ టీమ్ రీ-ఆర్గనైజేషన్‌పై కసరత్తు చేస్తోంది. వచ్చే నెలలో లీగ్‌ దశ మ్యాచ్‌లు ఉండాలా వద్దా అని ఆలోచిస్తున్నాం. ఐపీఎల్ తర్వాత మిగిలిన మ్యాచ్‌లను నిర్వహించవచ్చు. ” అని తెలిపారు.

రంజీ ట్రోఫీని రెండు దశల్లో నిర్వహింస్తే ఇబ్బందులు ఏంటి ? 
బీసీసీఐ ఈ టోర్నీని రెండు దశల్లో నిర్వహిస్తే.. రెండో దశలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. రెండవ దశ జరిగేటప్పుడు భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో రుతుపవనాలు ప్రారంభమవుతాయి. అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో వేడి తీవ్రతరం అవుతుంది. అరుణ్ ధుమాల్ మాట్లాడుతూ, "ఆపరేషన్స్ టీమ్  వాతావరణం, స్థల లభ్యతతో పాటు లాజిస్టిక్ విషయాలపై పని చేస్తోంది. టోర్నీని నిర్వహించడానికి మేము చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము. అలాగే ఆటగాళ్ల భద్రత విషయంలో మేము ఎలాంటి రాజీపడము." అని అన్నారు.

ఈ కరోనా మహమ్మారి గత సీజన్‌లోను దేశవాళీ క్రికెట్‌ను దెబ్బతీసింది. బి‌సి‌సి‌ఐ విజయ్ హజారే ట్రోఫీ ఇంకా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ అనే రెండు టోర్నమెంట్‌లను మాత్రమే నిర్వహించగలదు. ఈ సందర్భంగా ఆర్థికంగా నష్టపోయిన ఆటగాళ్లందరికీ బీసీసీఐ పరిహారం అందజేసింది.

click me!