అమ్మాయిని పంపిస్తే.. క్రికెట్ టీంలో ఉంటావు.. బీసీసీఐ వేటు

First Published Jul 20, 2018, 10:11 AM IST
Highlights

తన కోసం వేశ్యను హోటల్‌కు పంపాలని కోరడం ఆడియోలో వినిపించింది! కొన్ని మ్యాచ్‌ల తర్వాత జట్టులో తప్పక పేరుంటుందని సైఫి హామి ఇవ్వడం మరో టేప్‌లో వినిపించింది. జట్టులో ఎంపిక చేసేందుకు సెలక్టర్లు లంచం అడగడం  ఎప్పటి నుంచో నడుస్తోందని కొందరు క్రికెటర్లు చెప్పడం విశేషం. 

క్రికెట్ జట్టులో చోట దక్కాలంటే.. నాకోసం నువ్వు ఒక అమ్మాయిని పంపించాలి. అలా చేస్తే.. నువ్వు జట్టులో ఆట ఆడతావు అంటూ.. ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా వ్యక్తిగత సహాయకుడు క్రికెటర్లతో బేరసారాలు ఆడాడు. విషయం తెలుసుకున్న బీసీసీఐ అతనిపై వేటు వేసింది.

పూర్తి వివరాల్లోకి వెళితే... రాజీవ్ శుక్లా ప్రస్తుతం ఉత్తర్‌ప్రదేశ్‌ క్రికెట్‌ సంఘం (యూపీసీఏ) డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. అతడి సహాయకుడు అక్రమ్‌ సైఫీకు యూపీసీఏలో ఎలాంటి పదవి లేదు. ఐతే ఆ సంఘంలో అక్రమ్‌ సైఫీ చక్రం తిప్పుతున్నాడని సమాచారం. అక్రమ్‌కు, క్రికెటర్‌ రాహుల్‌ శర్మకు మధ్య జరిగిన సంభాషణలకు సంబంధించిన ఆడియో టేప్‌లను గురువారం ఓ హిందీ న్యూస్‌ ఛానెల్‌ బయటపెట్టింది. 

ఉత్తర్‌ప్రదేశ్‌ జట్టులో చోటు కల్పించేందుకు లంచం డిమాండ్‌ చేసిన సైఫి.. తన కోసం వేశ్యను హోటల్‌కు పంపాలని కోరడం ఆడియోలో వినిపించింది! కొన్ని మ్యాచ్‌ల తర్వాత జట్టులో తప్పక పేరుంటుందని సైఫి హామి ఇవ్వడం మరో టేప్‌లో వినిపించింది. జట్టులో ఎంపిక చేసేందుకు సెలక్టర్లు లంచం అడగడం  ఎప్పటి నుంచో నడుస్తోందని కొందరు క్రికెటర్లు చెప్పడం విశేషం. 

ఐతే తనపై వచ్చిన ఆరోపణలను సైఫి ఖండించాడు. తన పేరును చెడగొట్టేందుకు అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నాడు. సైఫికి బోర్డుతో గానీ, ఉత్తర్‌ ప్రదేశ్‌ క్రికెట్‌ సంఘంతో గానీ ఎలాంటి సంబంధం లేదని బీసీసీఐ స్పష్టం చేసింది. బోర్డు సభ్యులు వ్యక్తిగత సహాయకులుగా తమకు ఇష్టం వచ్చిన వారిని నియమించుకోవచ్చని, ఐతే వారికి బోర్డు నుంచి వేతనం అందుతుందని వివరణ ఇచ్చింది. 

click me!