తండ్రి అయిన స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ

By ramya neerukondaFirst Published Dec 31, 2018, 11:00 AM IST
Highlights

టీం ఇండియా స్టార్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ తండ్రి అయ్యారు. రోహిత్ 2015లో తన చిన్ననాటి స్నేహితురాలు రితిక ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 

టీం ఇండియా స్టార్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ తండ్రి అయ్యారు. రోహిత్ 2015లో తన చిన్ననాటి స్నేహితురాలు రితిక ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా.. ఆదివారం రోహిత్, రితిక దంపతులకు ఆడపిల్ల జన్మించింది. ఈ విషయాన్ని రితిక బంధువు సీమా ఖాన్ తన ఇస్ట్రాగ్రామ్ లో పోస్టు చేశారు.

దీంతో.. రోహిత్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రోహిత్ కి సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలియజేస్తున్నారు. అయితే.. ఇప్పటి వరకు ఈ విషయంపై రోహిత్ స్పందించలేదు. 

ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న రోహిత్.. ఇటీవల తన భార్య ప్రసవ సమయంలో పక్కనే ఉండాలనే ఉద్దేశంతో భారత్ కి తిరిగి వచ్చాడు.దీంతో ఆస్ట్రేలియాతో జరగనున్న నాలుగో టెస్టుకి రోహిత్ దూరం కానున్నాడు. 

click me!