ధోనీ ఇంట్లో దొంగతనం.. ముగ్గురి అరెస్ట్

By telugu teamFirst Published Jun 7, 2019, 2:20 PM IST
Highlights

టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఇంట్లో చోరీ జరిగింది. అయితే... అది ధోనీ ఇళ్లు అని తెలీక వాళ్లు దొంగతనం చేయడం గమనార్హం. కాగా... ఈ కేసులో పోలీసులు నిందితులు ముగ్గురిని అరెస్టు చేశారు.
 

టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఇంట్లో చోరీ జరిగింది. అయితే... అది ధోనీ ఇళ్లు అని తెలీక వాళ్లు దొంగతనం చేయడం గమనార్హం. కాగా... ఈ కేసులో పోలీసులు నిందితులు ముగ్గురిని అరెస్టు చేశారు.

పూర్తి వివరాల్లోకి వెళితే..ధోనీకి నోయిడాలోని సెక్టార్ 104లో ఒక ఇల్లు ఉంది. దాన్ని ఆయన విక్రమ్ సింగ్ అనే వ్యక్తికి అద్దెకు ఇచ్చారు. ఈ ఇంట్లో కొన్ని రోజుల క్రితం దొంగతనం జరిగింది. కొద్ది రోజులుగా ఇంటికి మరమ్మత్తులు చేస్తున్నారు. ఈ క్రమంలో ముగ్గురు వ్యక్తులు ఇంట్లోకి దూరి  ఖరీదైన ఎల్ఈడీ టీవీని చోరీ  చేశారు.  దీంతో విక్రమ్ సింగ్ పోలీసులను ఆశ్రయించారు. 

ధోనీ ఇల్లు ఉన్న ప్రాంతంలోనే మరిన్ని చోరీలు జరిగినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి తొమ్మిది బ్యాటరీలు, మూడు ఇన్వెర్టర్లు, ఐదు ల్యాప్‌టాప్‌లు, ఐదు ఎల్‌ఈడీ టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రాహుల్, బబ్లూ, ఇక్బాల్‌గా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

click me!