బ్లాక్ మెయిల్ చేస్తారా..? బీసీసీఐ ఫైర్

By telugu teamFirst Published Apr 27, 2019, 8:24 AM IST
Highlights

వచ్చే నెలలో జరగాల్సిన మహిళల ఐపీఎల్ లో పాల్గొనకుండా ఆసీస్ క్రీడాకారిణులను క్రికెట్ ఆస్ట్రేలియా అడ్డుకుంది. కాగా.. దీనిపై బీసీసీఐ ఫైర్ అయ్యింది. 

వచ్చే నెలలో జరగాల్సిన మహిళల ఐపీఎల్ లో పాల్గొనకుండా ఆసీస్ క్రీడాకారిణులను క్రికెట్ ఆస్ట్రేలియా అడ్డుకుంది. కాగా.. దీనిపై బీసీసీఐ ఫైర్ అయ్యింది. వచ్చే ఏడాది  జనవరిలో తమ పురుషుల జట్టు బారత్ లో ఆడాల్సిన సీరిస్ కి సంబంధించిన వివాదం పరిష్కారం కాని నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా ఈ నిర్ణయం తీసుకుంది. కాగా.. క్రికెట్ ఆస్ట్రేలియా తీసుకున్న ఈ నిర్ణయం పై బీసీసీఐ మండిపడింది.

భవిష్య పర్యటన ప్రణాళిక (ఎఫ్‌టీపీ) ప్రకారం 2020 జనవరిలో భారత్‌తో ఆసీస్‌ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ ఆడాల్సివుంది. ఐతే ప్రసారదారుల ఒత్తిడితో ఈ సిరీస్‌ను ఎలాగైనా వాయిదా వేయాలనుకుంటున్న క్రికెట్ ఆస్ట్రేలియా.. మహిళా క్రికెటర్లను ఆపడం ద్వారా బీసీసీఐపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తోంది. సీఏ ఉన్నతాధికారిణి బెలిందా క్లార్క్‌.. బీసీసీఐకి పంపిన ఈమెయిల్‌లో అది స్పష్టమవుతోంది. 

‘‘ఎఫ్‌టీపీ ప్రకారం 2020లో ఆడాల్సిన సిరీస్‌కు సంబంధించిన సమస్య పరిష్కారమైతే మా మహిళా క్రికెటర్లను ఐపీఎల్‌కు పంపడంపై నిర్ణయం తీసుకోగలుగుతాం’’ అని మెయిల్‌లో క్లార్క్‌ పేర్కొంది. మహిళా క్రికెటర్లకు అనుమతిచ్చేందుకు ఇలా షరతులు పెట్టడమేంటని సీఏపై బీసీసీఐ ధ్వజమెత్తింది.

‘‘క్లార్క్‌ ఈమెయిల్‌ చూస్తే వాళ్లు బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. మహిళా ప్లేయర్‌లను పంపడానికి, పురుషుల సిరీస్‌కు సంబంధమేంటి? ఎఫ్‌టీపీ ప్రకారం ఆ సిరీస్‌ జరగాల్సివుంది. సిరీస్‌పై వాళ్లిప్పుడు వెనుకంజవేస్తున్నారు’’ అని ఓ బీసీసీఐ అధికారి అన్నాడు.

click me!