MTB Himachal Janjehli 2022 1st Edition : ముగిసిన స్టేజ్-2 రేస్.. 48మంది రైడర్లు, 37 కి.మీల మేర సాగిన పోటీ

By Siva KodatiFirst Published Jun 25, 2022, 7:34 PM IST
Highlights

ఎంటీబీ హిమాచల్ జంజెహ్లీ 2022 తొలి ఎడిషన్ స్టేజ్ 2లో దేశంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన 48 మంది రైడర్‌లు పాల్గొన్నారు. తండపాని, చిండి, జంజెహ్లి వరకు సాగింది. ఇందులో రైడర్లు 37 కి.మీల మేర ప్రయాణించారు. కర్సోగ్ సమీపంలోని సనార్లీ నుంచి రాయ్‌ఘర్ వరకు అధిరోహించారు.

శనివారం (జూన్ 25)న జరిగిన ఎంటీబీ హిమాచల్ జంజెహ్లీ 2022 మొదటి ఎడిషన్ స్టేజ్‌ 2లో దేశంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన 48 మంది రైడర్‌లు పాల్గొన్నారు. ఈ రోజు తండపాని, చిండి, జంజెహ్లి వరకు సాగింది. ఇందులో రైడర్లు 37 కి.మీల మేర ప్రయాణించారు. కర్సోగ్ సమీపంలోని సనార్లీ నుంచి రాయ్‌ఘర్ వరకు అధిరోహించారు. ఈ రేసులో అత్యంత ఎత్తైన ప్రదేశం 2750 మీటర్ల షికారి మాత ఆలయం వద్ద వుంది. 

 

 

స్టేజ్ 2 కూడా స్టేజ్ 1 మాదిరే శక్తివంతమైనదని నిర్వాహకులు అన్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లో సైక్లింగ్ టూరిజాన్ని ప్రోత్సహించడం ఈ ఈవెంట్ ముఖ్యోద్దేశం. ముఖ్యంగా ఆ హిమాలయ రాష్ట్రం అందించే అందమైన ట్రాక్‌లు, ట్రయల్స్ మీదుగా సైక్లింగ్ చేయడం ఒక సవాల్ అని వారు పేర్కొన్నారు. హిమాచల్ టూరిజం, హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం, హిమాలయన్ అడ్వెంచర్ స్పోర్ట్స్ అండ్ టూరిజం ప్రమోషన్ అసోసియేషన్ (హెచ్‌ఏఎస్‌టీపీఏ) ఈ ప్రత్యేకమైన మౌంటేన్ బైకింగ్ రేసును నిర్వహిస్తోంది. 

 

 

స్టేజ్ 1లో ఉత్తీర్ణత సాధించిన 48 మంది రైడర్‌లు నేటీ ఈవెంట్‌లో పాల్గొన్నారు. స్టేజ్ 2లో వారి పనితీరు ఆధారంగా ఫలితాలు ఇలా వున్నాయి. 

అండర్ -16 కేటగిరీ 

1. యుగల్ ఠాకూర్
2. వంశ్ కాలియా
3. అధిరత్ వాలియా

అండర్ -19 కేటగిరీ (బాలురు)

1. రాజ్‌బీర్ సింగ్ సయాన్
2. అర్పిత్ శర్మ
3. కునాల్ బన్సాల్

 

 

అండర్ -19 కేటగిరీ (బాలికలు)

1. దివిజా సూద్
2. కయానా సూద్

అండర్ -19 కేటగిరీ

1. సునీతా బరోన్పా
2. అస్తా దూబే

 


అండర్ -23 కేటగిరీ (బాలురు)

1. పృథ్వీరాజ్ సింగ్ రాథోడ్
2. అరుష్ ఉపమన్యు
3. అనీష్ దూబే

అండర్ -35 కేటగిరీ (పురుషులు)

1. రాకేష్ రాణా
2. కృష్ణవేంద్ర యావ్
3. రామకృష్ణ పటేల్

అండర్ -50 కేటగిరీ (పురుషులు)

1. సునీల్ బరోంగ్పా
2. అమిత్ బయాన్

ఏ- 50 కేటగిరీ

1. మహేశ్వర్ దత్


 

click me!