సింధుకి బంగారు పతకం... ఎమ్మెస్కే అభినందనలు

By telugu teamFirst Published Aug 26, 2019, 10:04 AM IST
Highlights

గతంలో రెండు సార్లు ఫైనల్స్ దాకా చేరుకోని...  స్వర్ణాన్ని చేజార్చుకున్న సింధు... ఈసారి పట్టుపట్టి సాధించింది. దేశ గౌరవాన్ని మరోసారి ప్రపంచానికి చాటింది. ఈ సందర్భంగా ఆమెను ప్రజలు అభినందిస్తున్నారు.

ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌ పి.వి. సింధుపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. బ్యాడ్మింటన్ లో సింధు విశ్వవిజేతగా నిలిచింది.  గతంలో రెండు సార్లు ఫైనల్స్ దాకా చేరుకోని...  స్వర్ణాన్ని చేజార్చుకున్న సింధు... ఈసారి పట్టుపట్టి సాధించింది. దేశ గౌరవాన్ని మరోసారి ప్రపంచానికి చాటింది. ఈ సందర్భంగా ఆమెను ప్రజలు అభినందిస్తున్నారు.

సింధు,  కోచ్ పుల్లెల గోపీచంద్‌పై భారత జట్టు చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ కూడా  ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ గెలుచుకున్న పి.వి.సింధుకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఆమె కృషి, పట్టుదల, ఏకాగ్రతకు ఇది నిదర్శనమని, ప్రపంచమంతా ఆమెను చూసి గర్వపడాలన్నారు. బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్‌లాంటి ఏకాగ్రత, కృషి, పట్టుదల కలిగిన వ్యక్తిని చూడలేదన్నారు. కాగా క్రీడాకారులు సింధు, సాయి ప్రణీత్ కోచ్ పుల్లెల గోపీచంద్‌కు ప్రత్యేక అభినందనలు.

click me!