ప్రత్యర్థులతో పోరాటం.. తల్లీగా బాధ్యత: మైదానంలోనే బిడ్డకు పాలిచ్చిన క్రీడాకారిణీ

By Siva KodatiFirst Published Dec 10, 2019, 8:54 PM IST
Highlights

ప్రత్యర్ధి జట్టుతో తలపడుతూనే విరామ సమయంలో తన బిడ్డకు మైదానంలోనే పాలిచ్చి ఆకలి తీర్చి తల్లిగా తన బాధ్యతను నెరవేర్చారు.

ఎంత స్థాయిలో ఉన్నా తల్లి తల్లే... ప్రత్యర్థితో తలపడుతూనే బిడ్డ ఆకలి తీర్చిందో క్రీడాకారిణి. వివరాల్లోకి తెలితే.. మిజోరంకు చెందిన వాలీబాల్ క్రీడాకారిణి లాల్‌వెంట్లుయాంగీ... రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో భాగంగా టుయ్‌కమ్ వాలీబాల్ జట్టు తరపున పాల్గొన్నారు.

Also Read:ధోనిపై విరాట్‌కున్న అభిమానం: గోల్డెన్ ట్వీట్ ఆఫ్ 2019గా మారింది

కొద్దినెలల క్రితమే ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చారు. బిడ్డతో పాటే ఆమె పోటీల్లో పాల్గొనేందుకు వచ్చారు. ప్రత్యర్ధి జట్టుతో తలపడుతూనే విరామ సమయంలో తన బిడ్డకు మైదానంలోనే పాలిచ్చి ఆకలి తీర్చి తల్లిగా తన బాధ్యతను నెరవేర్చారు.

Also Read:నో సెలబ్రేషన్స్... ఓన్లీ సైలెన్స్: కోహ్లీ ఔటయ్యాక ఓవరాక్షన్ చేయని కరేబీయన్లు

ఇందుకు సంబంధించిన ఫోటోను కొందరు ఆన్‌లైన్‌లో పోస్ట్ చేయడంతో అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తల్లీగా, క్రీడాకారిణిగా ఏకకాలంలో తన పాత్రను నిర్వర్తించిన లాల్‌వెంట్లుయాంగీపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మిజోరం రాష్ట్ర క్రీడల మంత్రి రోమావియా సైతం ఆమెను అభినందించి రూ.10 వేల బహుమతిని ప్రకటించారు. 

click me!