అవమానించాడు: రమేష్ పొవార్ పై బిసిసిఐకి మిథాలీ లేఖ

By pratap reddyFirst Published Nov 27, 2018, 4:21 PM IST
Highlights

మిథాలీ రాజ్ ను తుది జట్టులోకి తీసుకోకపోవడం పట్ల విచారమేమీ లేదని ఇంగ్లాండుతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచులో ఓటమి తర్వాత కెప్టెన్ కౌర్ అన్నారు. దానిపై మిథాలీ రాజ్ మేనేజర్ తీవ్రంగా ధ్వజమెత్తారు. 

ముంబై: జాతీయ మహిళా క్రికెట్ జట్టు కోచ్ రమేష్ పొవార్ ట్వంటీ20 మహిళా ప్రపంచ కప్ టోర్నమెంట్ సందర్భంగా తనను అవమానించాడని భారత క్రికెట్ జట్టు సీనియర్ సభ్యురాలు మిథాలీ రాజ్ ఆరోపించారు. ఈ మేరకు ఆమె బిసిసిఐకి లేఖ రాశారు. తన పట్ల రమేష్ పొవార్ పక్షపాతం, వివక్ష ప్రదర్శించారని ఆమె విమర్శించారు. 

ఇంగ్లాండుతో జరిగిన కీలకమైన సెమీ ఫైనల్ మ్యాచుకు ఎంపిక చేసిన తుది జట్టులో మిథాలీ రాజ్ కు చోటు కల్పించలేదు. ఇది అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ మ్యాచును భారత జట్టు ఓడిపోయింది. 

ఆ విషయంపై వివాదం చెలరేగడంతో జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, మిథాలీ రాజ్ సోమవారంనాడు బిసిసి అధికారులను కలిశారు.  ట్వంటీ20 మహిళా ప్రపంచ కప్ క్రికెట్ సిరీస్ లో మిథాలీ రాజ్ రెండు మ్యాచుల్లో అర్థ సెంచరీలు చేశారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచుగా కూడా రెండు సార్లు ఎంపికయ్యారు. 

మిథాలీ రాజ్ ను తుది జట్టులోకి తీసుకోకపోవడం పట్ల విచారమేమీ లేదని ఇంగ్లాండుతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచులో ఓటమి తర్వాత కెప్టెన్ కౌర్ అన్నారు. దానిపై మిథాలీ రాజ్ మేనేజర్ తీవ్రంగా ధ్వజమెత్తారు. 

సంబంధిత వార్తలు

మిథాలీని ఎందుకు తప్పించావ్... హర్మన్ ప్రీత్‌పై బీసీసీఐ ఆగ్రహం

హర్మన్ ప్రీత్ కౌర్ పై మిథాలి రాజ్ మేనేజర్ సంచలన కామెంట్స్

పరుగుల రాణి: మిథాలీరాజ్ డ్రాప్ వెనక ఆయనే...

టీ20 ప్రపంచకప్: మిథాలీ ఉంటే గెలిచేవాళ్లం..హర్మన్‌పై అభిమానుల ఫైర్

నో రిగ్రెట్స్: మిథాలీని పక్కన పెట్టడంపై కౌర్

క్రికెట్‌లో సంచలనం..ఇండియాలో స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ సనత్ జయసూర్య..?

బీసీసీఐ ఆదేశాలను పట్టించుకోని షమి.. చెప్పిందేంటి..? చేసిందేంటీ..?

గ్రౌండ్‌లోనే కాదు... కోర్టులోనూ పాక్‌పై మనదే గెలుపు

రోహిత్‌,కోహ్లీలను వెనక్కినెట్టిన మిథాలీ...ఇప్పుడు గప్టిల్ ను కూడా...

click me!