మూడో వన్డేకి ధోనీ దూరం: ఆరేళ్ల తర్వాత గాయం వల్ల మ్యాచ్ ఆడని మహీ

By sivanagaprasad kodatiFirst Published Jan 29, 2019, 11:54 AM IST
Highlights

న్యూజిలాండ్‌‌తో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి రెండు వన్డేల్లో తన అద్భుత ప్రదర్శనతో జట్టుకు విజయాన్ని అందించిన టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ మూడో వన్డేలో కనిపించకపోవడం అతని ప్లేస్‌లో హార్డిక్ పాండ్యా ఆడటంతో అభిమానులు నిరాశకు గురయ్యారు

న్యూజిలాండ్‌‌తో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి రెండు వన్డేల్లో తన అద్భుత ప్రదర్శనతో జట్టుకు విజయాన్ని అందించిన టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ మూడో వన్డేలో కనిపించకపోవడం అతని ప్లేస్‌లో హార్డిక్ పాండ్యా ఆడటంతో అభిమానులు నిరాశకు గురయ్యారు.

మరోసారి ధోనీని పక్కన బెట్టేందుకు కుట్రలు జరుగుతున్నాయేమోనని కంగారు పడ్డారు. అయితే గాయం కారణంగా ధోనీని ఈ మ్యాచ్‌లో ఆడించలేదని టీమ్ మేనేజ్‌మెంట్ ప్రకటించడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

సోమవారం తొడ కండరాల గాయంతో ధోనీ మ్యాచ్‌కు దూరమయ్యాడు. తన 14 సంవత్సరాల సుధీర్ఘ కెరీర్‌లో గాయం కారణంగా మ్యాచ్‌కు దూరం కావడం ఇదే ఆరోసారి. గతంలో 2013లో చివరి సారిగా ఇలా గాయం కారణంగా మ్యాచ్‌కు దూరమయ్యాడు.

అప్పుడు మూడు వన్డేలు ఆడలేకపోయాడు. అంతకు ముందు 2007లో వైరల్ ఫీవర్ కారణంగా ఐర్లాండ్, దక్షిణాఫ్రికాలతో జరిగిన మ్యాచ్‌లకు మహేంద్రుడు పాలుపంచుకోలేకపోయాడు.

ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో తన ఆట తీరుపై వస్తున్న విమర్శలకు బ్యాట్‌తోనే సమాధానం చెప్పిన ధోనీ... ఆ సిరీస్‌లో అద్బుత ప్రదర్శనతో మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌ అందుకున్నాడు. తాజా న్యూజిలాండ్ సిరీస్‌లో బ్యాట్‌తో పాటు వికెట్ కీపింగ్‌తోనూ జట్టును గెలిపిస్తున్నాడు. 

ధోనీ రికార్డును సమం చేసిన రోహిత్ శర్మ

ఇంగ్లీష్‌లో షమీ ప్రసంగం.. హిందీలో న్యూజిలాండ్ యాంకర్ పొగడ్తలు

బిగ్ రిలీఫ్: రాహుల్, పాండ్యాలపై సస్పెన్షన్ ఎత్తివేత

పాండ్యా వివాదంపై మొదటిసారి స్పందించిన కరణ్ జోహర్...

హర్దిక్ పాండ్యాకు మరో షాక్

హార్ధిక్ పాండ్యా, రాహుల్‌లకు షోకాజ్ నోటీసులు జారీచేసిన బిసిసిఐ

సెక్సిస్ట్ కామెంట్లపై వివాదం.. పాండ్యా క్షమాపణలు

పాండ్యా, రాహుల్‌లపై రెండు వన్డేల నిషేదం...సీఓఏ ఛైర్మన్ వినోద్ రాయ్

పాండ్యా తల దించుకున్నా అద్భుతం చేశాడు: కోహ్లీ

వరల్డ్ నెంబర్ వన్‌కు చేరువలో కోహ్లీ...దిగ్గజ క్రికెటర్ రిచర్డ్స్ రికార్డు బద్దలు

click me!