ఇంగ్లీష్‌లో షమీ ప్రసంగం.. హిందీలో న్యూజిలాండ్ యాంకర్ పొగడ్తలు

By sivanagaprasad kodatiFirst Published Jan 29, 2019, 11:25 AM IST
Highlights

న్యూజిలాండ్ గడ్డపై భారత్ గెలవడం అసాధ్యమంటూ గత కొన్నేళ్లుగా వస్తున్న అవహేళనకు టీమిండియా తన ప్రదర్శనతోనే సమాధానం చెప్పింది. ఐదు వన్డేల సిరీస్‌లో రెండు వన్డేలు మిగిలి వుండగానే భారత్ సిరీస్ కైవసం చేసుకుంది. 

న్యూజిలాండ్ గడ్డపై భారత్ గెలవడం అసాధ్యమంటూ గత కొన్నేళ్లుగా వస్తున్న అవహేళనకు టీమిండియా తన ప్రదర్శనతోనే సమాధానం చెప్పింది. ఐదు వన్డేల సిరీస్‌లో రెండు వన్డేలు మిగిలి వుండగానే భారత్ సిరీస్ కైవసం చేసుకుంది.

ఈ విజయంలో కీలకపాత్ర పోషించిన వ్యక్తి పేస్ బౌలర్ మహ్మద్ షమీ. ఆరంభ ఓవర్లలోనే వరుస పెట్టి అతను న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్లను ఔట్ చేసేవాడు. మిగిలిన పనిని స్పిన్నర్లు చాహల్, కుల్‌దీప్ పూర్తి చేసేవారు.

ఈ క్రమంలో మౌంట్ మాంగనుయ్‌లో జరిగిన మూడో వన్డేలో భారత్ న్యూజిలాండ్‌ను ఓడించి సిరీస్ కైవసం చేసుకుంది. దీంతో కోహ్లీ సేన చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్‌లో 3 వికెట్లు తీసి భారత్ గెలుపుబాట పట్టించిన షమీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

అవార్డు అందుకుంటున్న సమయంలో ఒక ఫన్నీ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. ఎప్పుడూ హిందీలో మాట్లాడే షమీ.. ఈసారి ఇంగ్లీష్‌లో మాట్లాడాడు. హిందీలో మాట్లాడినప్పుడు కోహ్లీతో అనువాదం చెప్పించేవాడు.

అయితే ఈసారి మాత్రం న్యూజిలాండ్‌లో ఎదురుగాలుల్లో బౌలింగ్ చేయడం ఎలా ఉందని యాంకర్, న్యూజిలాండ్ మాజీ బౌలర్ సిమన్ డౌల్ ప్రశ్నించాడు. దీనికి షమీ ఇంగ్లీషులో బదులిస్తూ.. ‘‘నిజానికి ఎదురు గాలిలో బౌలింగ్ చేయడం కష్టం. కానీ అది అసాధ్యం మాత్రం కాదు. మరో ఎండ్ నుంచి భువనేశ్వర్ సాయం అందించాడు.

లైన్ అండ్ లెంగ్త్‌లో బంతులను సంధించడమే ముఖ్యమన్నాడు’. ఆ స్పందనకు ఎంతో సంతోషించిన సిమన్.. ‘‘షమీ యువర్ ఇంగ్లీష్ బహుత్ అచ్చా.. అభినందనలు’’ అని హిందీలో ప్రశంసించాడు. 

బిగ్ రిలీఫ్: రాహుల్, పాండ్యాలపై సస్పెన్షన్ ఎత్తివేత

పాండ్యా వివాదంపై మొదటిసారి స్పందించిన కరణ్ జోహర్...

హర్దిక్ పాండ్యాకు మరో షాక్

హార్ధిక్ పాండ్యా, రాహుల్‌లకు షోకాజ్ నోటీసులు జారీచేసిన బిసిసిఐ

సెక్సిస్ట్ కామెంట్లపై వివాదం.. పాండ్యా క్షమాపణలు

పాండ్యా, రాహుల్‌లపై రెండు వన్డేల నిషేదం...సీఓఏ ఛైర్మన్ వినోద్ రాయ్

పాండ్యా తల దించుకున్నా అద్భుతం చేశాడు: కోహ్లీ

వరల్డ్ నెంబర్ వన్‌కు చేరువలో కోహ్లీ...దిగ్గజ క్రికెటర్ రిచర్డ్స్ రికార్డు బద్దలు


 

click me!