ధోనీ రికార్డును సమం చేసిన రోహిత్ శర్మ

By pratap reddyFirst Published Jan 29, 2019, 11:51 AM IST
Highlights

న్యూజిలాండ్ పై భారత్ 3-0 స్కోరుతో వన్డే సిరీస్ ను గెలుచుకోవడంలో రోహిత్ శర్మ కీలక భూమిక పోషించాడు. మూడో వన్డేలో అతను 77 బంతుల్లో 62 పరుగులు చేసి భారత బ్యాట్స్ మెన్ లో టాప్ స్కోరర్ గా నిలిచాడు. 

న్యూఢిల్లీ: భారత వన్డే క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రికార్డును సమం చేశాడు. ధోనీ సిక్స్ ల రికార్డును అతను సమం చేశాడు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనలో రోహిత్ శర్మ అద్భుతమైన ఫామ్ ను కనబరిచిన విషయం తెలిసిందే. 

న్యూజిలాండ్ పై భారత్ 3-0 స్కోరుతో వన్డే సిరీస్ ను గెలుచుకోవడంలో రోహిత్ శర్మ కీలక భూమిక పోషించాడు. మూడో వన్డేలో అతను 77 బంతుల్లో 62 పరుగులు చేసి భారత బ్యాట్స్ మెన్ లో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇందులో అతను రెండు సిక్స్ లు బాదాడు. దాంతో ధోనీ రికార్డును సమం చేయగలిగాడు. 

ధోనీ 337 వన్డేల్లో 222 సిక్స్ లు బాదాడు. ఏడు సిక్స్ లు ఏషియా ఎలెవన్ తరఫున ఆడుతూ కొట్టాడు. ఆ రకంగా ధోనీ ఖాతాలో 225 సిక్స్ లు ఉన్నాయి. న్యూజిలాండ్ పై జరిగిన మూడో వన్డేలో ఫెర్గూసన్ వేసిన బంతిని సిక్స్ కు తరలించడం ద్వారా వన్డేల్లో 215 సిక్స్ లు కొట్టిన రికార్డు నెలకొల్పాడు.  

గాయం కారణంగా ధోనీ మూడో వన్డేకు దూరమయ్యాడు. దాంతో అతను తన సిక్స్ ల సంఖ్యను పెంచుకోలేకపోయాడు. ధోనీ ఫిట్ గా ఉంటే న్యూజిలాండ్ తో జరిగే రెండు వన్డేలు ఆడుతాడు. దీంతో రోహీత్, ధోనీ సిక్స్ ల విషయంలో పోటీ పడే అవకాశం ఉంది. 

సిక్స్ ల విషయంలో రోహిత్, ధోనీ అగ్రస్థానంలో ఉండగా సచిన్ టెండూల్కర్ 195 సిక్స్ లతో రెండో స్థానంలో ఉన్నాడు. సౌరవ్ గంగూలీ 189 సిక్స్ లతో, యువరాజ్ సింగ్ 153 సిక్స్ లతో తర్వాత స్థానాల్లో నిలిచారు. 

click me!