కరుణానిధిలో మరో కోణం.. క్రికెట్ అంటే మహాపిచ్చి

First Published 8, Aug 2018, 3:43 PM IST
Highlights

ముఖ్యంగా మహేంద్ర సింగ్ ధోని, సచిన్ టెండుల్కర్, శ్రీనాథ్, కపిల్ దేవ్ అంటే కరుణానిధికి చాలా అభిమానం.
 

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కి క్రికెట్ అంటే చాలా అభిమానం ఎక్కువ. ఐదుసార్లు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ఆయన.. తన హయాంలో  క్రీడలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. అంతర్జాతీయ వేదికలపై భారతదేశం సత్తా చాటిన క్రీడాకారులను ప్రత్యేకంగా అభినందించేవారు. ముఖ్యంగా మహేంద్ర సింగ్ ధోని, సచిన్ టెండుల్కర్, శ్రీనాథ్, కపిల్ దేవ్ అంటే కరుణానిధికి చాలా అభిమానం.

2014లో సచిన్ టెండుల్కర్ ‘‘ ప్లేయింట్ ఇట్ మై వే’’ పేరిట తన బయోగ్రఫీ విడుదల చేయగా.. దానిని కరుణానిధి అభినందించారు. రాజకీయాల్లో ఎప్పుడూ బిజీగా ఉండే కరుణానిధికి క్రికెట్ అంటే ఎంతో అభిమానించేవారు కరుణానిధి తన జీవితంలో ఎప్పుడూ క్రికెట్ కోసం సమయాన్ని కేటాయించేవారని అతని కుమార్తె కనిమొళి గతంలో చెప్పారు.

క్రికెట్ మ్యాచులను చూడటానికి కరుణానిధి కొన్ని సార్లు తన సమావేశాలు రద్దు చేసుకునేవారిని చేసుకునేవారు. ఇక ఆయన అస్వస్థతకు గురి కావడానికి ముందు ముని మనవడితో కలిసి సరదాగా క్రికెట్ ఆడారు. ఆయన స్వగృహంలో వీల్‌ ఛైర్‌లోనే కూర్చొని క్రికెట్ ఆడారు. వీల్ ఛైర్‌కే పరిమితమైనప్పటికీ బౌలింగ్ వేసి పిల్లాడితో సరదాగా ఆడారని ఆయన సన్నిహితులు తెలిపారు.


 

Last Updated 8, Aug 2018, 3:43 PM IST