పాక్ తో మ్యాచ్.. కపిల్ దేవ్ ఏమన్నారంటే..

By ramya NFirst Published Feb 23, 2019, 1:42 PM IST
Highlights

పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో.. ప్రపంచకప్ లో పాక్ తో భారత్ ఆడకూడదంటూ దేశవ్యాప్తంగా అభిమానులు కోరుకుంటున్నారు. 

పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో.. ప్రపంచకప్ లో పాక్ తో భారత్ ఆడకూడదంటూ దేశవ్యాప్తంగా అభిమానులు కోరుకుంటున్నారు. మ్యాచ్ ని రద్దు చేయాలని లేదా.. పాకిస్థాన్ ని బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఘటనపై గవాస్కర్, సచిన్ లు స్పందించారు. 

తాజాగా.. కపిల్ దేవ్ ఈ విషయంపై తొలిసారిగా నోరు విప్పారు.వచ్చే ప్రపంచకప్‌లో పాక్‌తో ఆడాలా? వద్దా? అనే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వానికే వదిలేయడం మంచిదని అభిప్రాయపడ్డారు.

‘‘ఆడటం, ఆడకపోవడం అనేది మనలాంటి వాళ్లు నిర్ణయించే అంశం కాదు. కేంద్ర ప్రభుత్వమే దీనిపై నిర్ణయం తీసుకోవాలి. దీనిపై మన సొంత అభిప్రాయాలు చెప్పకపోవడమే ఉత్తమం. నిర్ణయాన్ని ప్రభుత్వం, సంబంధిత వర్గాలకు వదిలేయాలి. దేశ ప్రయోజనాలకు అనుగుణంగానే వారి నిర్ణయం ఉంటుంది’’ అని  కపిల్‌ దేవ్‌ అన్నారు.

click me!