IPL 2024 : లక్నో సూపర్ జెయింట్స్ ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యా సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ జయదేవ్ ఉనద్కత్ బౌలింగ్ లో రెండు బ్యాక్ టు బ్యాక్ సిక్స్‌లు కొట్టడంతో ఐపీఎల్ 2024 లో 1,000వ సిక్సర్ ను నమోదుచేశాడు.
Tata IPL 2024, IPL Sixers Record : రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న ఐపీఎల్ 2024 57వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ అద్భుతమైన బౌలింగ్, బ్యాటింగ్ ప్రదర్శనను ప్రదర్శించింది. హైదరాబాద్ బౌలర్లు రాణించడంతో పరుగులు చేయడానికి అనుకూలంగా ఉండే పిచ్ పై పెద్ద హిట్టర్లతో కూడిన లక్నో జట్లు కేవలం పదహారు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో తన ఇన్నింగ్స్ ను ముగించింది.
అయితే, చివరలో ఆయుష్ బదోని, నికోలస్ పూరన్‌ల పోరాటంతో లక్నో సూపర్ జెయింట్స్ పోటీనిచ్చే స్కోరును నమోదుచేసింది. 20 ఓవర్లలో 165/4 పరుగులు చేసింది. అయితే, కేఎల్ రాహుల్, క్రునాల్ పాండ్యా కూడా ప్రారంభ దశలో కీలకమైన పరుగులను అందించారు. ఈ క్రమంలోనే ఈ ఐపీఎల్ సీజన్ లో 1000వ సిక్సర్ ను నమోదుచేశారు. లక్నో సూపర్ జెయింట్స్ ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యా సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ జయదేవ్ ఉనద్కత్ బౌలింగ్ లో రెండు బ్యాక్ టు బ్యాక్ సిక్స్‌లు కొట్టడంతో ఐపీఎల్ 2024 లో 1,000వ సిక్సర్ ను నమోదుచేశాడు.
undefined
సీఎస్కేను వెనక్కి నెట్టిన సన్‌రైజర్స్.. హైదరాబాద్ దెబ్బకు ప్లేఆఫ్ రేసు నుంచి ముంబై ఔట్
మొత్తం ఈ సీజన్ లో ప్లేయర్లు కేవలం 13,079 బంతుల్లోనే 1000 సిక్సర్లు బాదారు. ఇప్పటివరకు సాగిన ఐపీఎల్ సీజన్లలో అతితక్కువ బంతుల్లో ప్లేయర్లు 1000 సిక్సర్లు బాదిన సీజన్ ఇదే కావడం విశేషం. అంతకుముందు 1000 సిక్సర్ల మార్కును చేరుకునేందుకు 2023లో 15,390 బంతులు అవసరం అయ్యాయి.
ఐపీఎల్ చరిత్రలో 1,000 సిక్సర్లకు తక్కువ బంతుల సీజన్లు టాప్-3
ఐపీఎల్ 2024లో 13,079 బంతులు
ఐపీఎల్ 2023లో 15,390 బంతులు
ఐపీఎల్ 2022లో 16,269 బంతులు
మాటలు రావడం లేదు.. సన్ రైజర్స్ విధ్వంసంతో బిత్తరపోయిన కేఎల్ రాహుల్