BCCI shocked Sanju Samson : కీలక సమయంలో సంజూ శాంసన్ ఔట్ కావడంతో ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ఓటమి పాలైంది. అయితే, ఈ మ్యాచ్‌లో ఔట్ అయిన తర్వాత అంపైర్‌తో గొడవపడ్డ రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్, స్టార్ ప్లేయర్ సంజూ శాంసన్ కు బీసీసీఐ షాకిచ్చింది.
Sanju Samson who fought with the umpire : టీమిండియా యంగ్ ప్లేయర్, రాజస్థాన్ రాయల్స్ స్టార్ ప్లేయర్ అండ్ కెప్టెన్ సంజూ శాంసన్ కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) షాకిచ్చింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఔట్ అయిన తర్వాత అంపైర్ తో గొడవకు దిగడంతో శాంసన్‌కు బీసీసీఐ భారీ జరిమానా విధించింది. ఈ మ్యాచ్‌లో శాంసన్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి 46 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 86 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. అయితే, ముఖేష్ కుమార్ వేసిన బంతిని సంజు శాంసన్ భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించగా, బౌండరీ వద్ద నిలబడిన షాయ్ హోప్ బ్యాలెన్స్ చేస్తూ క్యాచ్ అందుకున్నాడు. ఈ క్యాచ్‌కు సంబంధించి మైదానంలో కలకలం రేగింది. సంజూ శాంసన్ సహచరులు అతను నాటౌట్ అని నమ్మారు కానీ, థర్డ్ అంపైర్ అతన్ని ఔట్ ఇచ్చాడు.
శాంసన్‌కు బీసీసీఐ షాక్..
undefined
ఐపీఎల్ 2024 ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వివాదాస్పదమైన అవుట్ తర్వాత మైదానంలో అంపైర్‌లతో తీవ్ర వాగ్వాదం చేసినందుకు సంజూ శాంసన్‌కు అతని మ్యాచ్ ఫీజులో 30% జరిమానా విధించింది బీసీసీఐ. టాటా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2024 మ్యాచ్ 56లో అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ ఐపిఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు అతని మ్యాచ్ ఫీజులో 30% జరిమానా విధించినట్లు బీసీసీఐ ఒక ప్రకటన తెలిపింది. శాంసన్ ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.8 ప్రకారం లెవల్ 1 నేరానికి పాల్పడ్డాడు. అతను దీనిని అంగీకరించాడనీ, అలాగే, మ్యాచ్ రిఫరీ నిర్ణయాన్ని అంగీకరించాడని తెలిపింది.
సూర్య సునామీ.. సచిన్ టెండూల్కర్, సనత్ జయసూర్య రికార్డులు బ్రేక్
శాంసన్ ఔట్ లో ఏం జరిగింది?
రాజస్థాన్ బ్యాటింగ్ సమయంలో, ముఖేష్ కుమార్ 16వ ఓవర్ బౌలింగ్ చేస్తున్నాడు. ఆ ఓవర్ 4వ బంతికి, సంజు శాంసన్ లాంగ్-ఆన్ మీదుగా భారీ షాట్ కొట్టడానికి ప్రయత్నించాడు, అయితే బౌండరీ వద్ద నిలబడి ఉన్న షాయ్ హోప్ బ్యాలెన్స్ చేస్తూ క్యాచ్ అందుకున్నాడు. పలు కెమెరా కోణాల్లో చూసిన తర్వాత థర్డ్ అంపైర్ సంజూ శాంసన్‌ను అవుట్‌గా ప్రకటించాడు. అయితే, హోప్ పాదం బౌండరీ లైన్‌కు చాలా దగ్గరగా ఉందని సైడ్ యాంగిల్ వెల్లడించింది. సంజూ శాంసన్, రాజస్థాన్ రాయల్స్ శిబిరంలోని అందరూ ఫీల్డర్ కాలు బౌండరీ లైన్‌ను తాకినట్లు విశ్వసించారు. అయితే టీవీ అంపైర్ సంజూ శాంసన్‌ను అవుట్‌గా ప్రకటించాడు. దీని తర్వాత శాంసన్ మైదానంలోని అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. అయితే, చివరికి అతను పెవిలియన్‌కు చేరుకోవాల్సి వచ్చింది.
శాంసన్ అభిమానులు కూడా సోషల్ మీడియాలో అంపైరింగ్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. 46 బంతుల్లో 86 పరుగుల ఇన్నింగ్స్ ఆడి సంజూ అవుటయ్యాడు. ఇది మ్యాచ్‌లో పెద్ద మలుపు తిరిగింది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు 20 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఐపీఎల్‌లో కామెంటరీ ప్యానెల్‌లో భాగమైన భారత మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ కూడా అంపైర్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. సంజూ శాంసన్‌ను నాటౌట్‌గా ప్రకటించాడు.
ఊచకోత అంటే ఇదే.. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలు షేక్ చేశారు.. హైదరాబాద్ చేతిలో చిత్తుగా ఓడిన లక్నో