IPL 2024, SRH vs LSG : ఐపీఎల్ 2024 లో మరోసారి సన్‌రైజర్స్ హైదరాబాద్ చెలరేగితే ఎలా ఉంటుందో చూపించారు ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపిస్తూ లక్నో సూపర్ జెయింట్స్ ను చెడుగుడు ఆడుకున్నారు. హైదరాబాద్ బ్యాటింగ్ దెబ్బకు కేఎల్ రాహుల్ కు దిమ్మదిరిగిపోయింది.
SRH vs LSG : ఎవరు కొడితే దిమ్మదిరిగి పోతుందో వారే సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు. హైదరాబాద్ అంతటా వర్షం పడిడే సన్ రైజర్స్ ఓపెనర్లు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో సునామీ సృష్టించాడు. బౌండరీల వర్షంతో పరుగుల వరద పారించారు. హైదరాబాద్ దెబ్బకు లక్నో అబ్బ అనక తప్పలేదు. హైదరాబాద్ ఓపెనింగ్ బ్యాటింగ్ చూసిన కేఎల్ రాహుల్ కు సైతం దిమ్మదిరిగిపోయి ఏం మాట్లాడాలో తెలియలేదు. అలా ఊచకోత చూపించారు. ఐపీఎల్ చరిత్రలో మరో రికార్డు విజయాన్ని అందుకుంది హైదరాబాద్.
ఐపీఎల్ 2024 57వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ - లక్నో సూపర్ జెయింట్స్ తలపడ్డాయి. లక్నో సూపర్ జెయింట్ ఉంచిన 166 పరుగుల లక్ష్యాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ కేవలం 58 బంతుల్లోనే సాధించింది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ తుఫాను బ్యాటింగ్ దెబ్బకు లక్నో బౌలర్లు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకున్నారు. కేఎల్ రాహుల్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడంతో లక్నో జట్టు 20 ఓవర్లలో 4 వికెట్లకు 165 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ 9.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 167 పరుగులతో అద్భుత విజయాన్ని అందుకుంది. ట్రావిస్ హెడ్ (89 పరుగులు), అభిషేక్ శర్మ (75 పరుగులు)లు సునామీ ఇన్నింగ్స్ మరోసారి దుమ్మురేపారు. హైదరాబాద్ బ్యాటింగ్ దెబ్బకు కేఎల్ రాహుల్ దిమ్మదిరిగిపోయింది.
ఊచకోత అంటే ఇదే.. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలు షేక్ చేశారు..
మ్యాచ్ అనంతరం లక్నో ఓటమిపై కేఎల్ రాహుల్‌ను ప్రశ్నించగా.. తనకు మాటలు రావడం లేదని చెప్పాడు. తమ జట్టు 240 పరుగులు చేసినా ఓడిపోయేదని పేర్కొన్నాడు. ఇలాంటి ఈ రకమైన బ్యాటింగ్‌ను టీవీలో చూశాం.. ఇప్పుడు వాస్తవంగా చూశామని చెప్పాడు. అద్భుతమైన బ్యాటింగ్ తో అదరగొట్టిన హైదరాబ్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలపై ప్రశంసలు కూడా కురిపించాడు. ట్రావిస్ హెడ్ ను ఆపడం కష్టంగా మారిందని చెప్పాడు. అభిషేక్ శర్మ మరోసారి అద్భుత బ్యాటింగ్ చేశాడని తెలిపాడు. ట్రావిస్ హెడ్ 30 బంతుల్లో అజేయంగా 89 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 8 సిక్సర్లు బాదాడు. అతని స్ట్రైక్ రేట్ 296.67. అభిషేక్ శర్మ 28 బంతుల్లో 75 పరుగులు చేశాడు. 8 ఫోర్లు, 6 సిక్సర్లు బాదాడు. అభిషేక్ 267.86 స్ట్రైక్ రేట్‌తో పరుగులు సాధించాడు.
KL Rahul said, "I'm lost for words, this is unreal batting". pic.twitter.com/ohcyep6cOt
— Mufaddal Vohra (@mufaddal_vohra)
అంపైర్ తో ఫైట్.. సంజూ శాంసన్‌కు షాకిచ్చిన బీసీసీఐ