IPL2020:చెన్నై ఓడినా ఆ అభిమాని గెలిచాడు... ప్రాణాలను పణంగాపెట్టి

By Arun Kumar PFirst Published Oct 18, 2020, 9:19 AM IST
Highlights

క్రికెట్ పై అభిమానంతో తన ప్రాణాలను కూడా లెక్కచేయలేయకుండా బంతిని దక్కించుకున్నాడో అభిమాని. 

షార్జా: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో మరో ఆసక్తికరమైన మ్యాచ్ కు షార్జా అంతర్జాతీయ స్టేడియం వేదికయ్యింది. చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ డిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య హోరాహోరీ పోరులో డిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. అయితే ఈ మ్యాచ్ లో కేవలం స్టేడియంలోనే కాదు స్టేడియం బయటా ఓ ఫీల్డర్(అభిమాని) నిలబడి బంతిని అమాంతం అందుకున్నాడు. ఇలా క్రికెట్ పై అభిమానంతో తన ప్రాణాలను కూడా లెక్కచేయలేయకుండా బంతిని దక్కించుకున్నాడు అభిమాని. 

శనివారం రాత్రి డిల్లీతో జరిగిన మ్యాచ్ లో చెన్నై మొదట బ్యాటింగ్ చేసి 180 పరుగుల స్కోరు చేసింది. ఈ మ్యాచ్ లో సీఎస్కే ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తన మార్కు షాట్లతో అదరగొట్టాడు. అయితే అతడి మెత్తం ఇన్నింగ్స్ కంటే కేవలం ఒకే ఒక్క సిక్స్ ఇప్పుడు వార్తల్లో నిలిచింది. కళ్లు చెదిరేలా అతడు స్టేడియం బయటకు బంతిని బాదగా ఓ అభిమాని దాన్ని అమాంతం అందుకున్నాడు. ముందుగానే స్టేడియం బయట కాచుకుని కూర్చున్న అభిమాని బంతి స్టేడియం బయట రోడ్డుపై పడగానే పరుగెత్తుకుని వెళ్లి తీసుకున్నాడు. 

ఇది స్టేడియంలోని కెమెరాల కంటికి చెక్కింది. అయితే సదరు అభిమాని ప్రాణాలకు సైతం తెగించి బిజీగా వుండే రోడ్డుపై అలా బంతికోసం పరుగెత్తడం విమర్శలకు దారితీస్తోంది. అభిమాని వ్యవహారాన్ని కామెంటేటర్లు తప్పుబట్టారు. ప్రాణాలకు తెగించి అతడలా బంతికోసం డేర్ చేయడాన్ని అభిమానులు సైతం తప్పుబడుతున్నారు. 

read more   ఢిల్లీ వర్సెస్ చెన్నై: ఆల్ రౌండ్ ప్రతిభతో మ్యాచును కైవసం చేసుకున్న డిసి

 ఇకపోతే ఐపిఎల్ సీజన్ 13లో మరో మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. సున్నాకే తొలి వికెట్‌ కోల్పోయినా 180 పరుగుల లక్ష్యాన్ని ఆఖరి ఓవర్‌‌లో రెండు బంతులు మిగిలి ఉండగానే చేధించి, రికార్డు విజయం అందుకుంది ఢిల్లీ క్యాపిటల్స్. 5 వికెట్ల తేడాతో అద్భుత విజయం అందుకున్న ఢిల్లీ, చెన్నై సూపర్ కింగ్స్‌ను కష్టాల్లోకి నెట్టేసింది.

180 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ మొదలెట్టిన ఢిల్లీ క్యాపిటల్స్‌కి తొలి ఓవర్‌లోనే షాక్ తగిలింది. పృథ్వీ షా డకౌట్ కాగా అజింకా రహానే 8 పరుగులకి అవుట్ అయ్యాడు. శ్రేయాస్ అయ్యర్ 23 పరుగులు చేసి అవుట్ కాగా, మార్కస్ స్టోయినిస్ 14 బంతుల్లో ఓ ఫోర్, రెండు సిక్సర్లతో 24 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

ఓ వైపు వికెట్లు పడుతున్నా శిఖర్ ధావన్ బౌండరీలతో ఒంటరిపోరాటం చేశాడు. 58 బంతుల్లో 14 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 101 పరుగులతో అజేయ శతకం బాదాడు. విజయానికి 5 బంతుల్లో 15 పరుగులు కావాల్సిన దశలో అక్షర్ పటేల్ హ్యాట్రిక్ సిక్సర్లు బాది మ్యాచ్‌ను ముగించాడు. ఈ విజయంతో మళ్లీ టాప్‌లోకి వెళ్లింది ఢిల్లీ క్యాపిటల్.
 

click me!