ఏషియన్ గేమ్స్: అదరగొట్టిన రోయర్లు, ఓ స్వర్ణం, రెండు కాంస్యాలు కైవసం

By Arun Kumar PFirst Published Aug 25, 2018, 11:43 AM IST
Highlights

ఏషియన్ గేమ్స్ లో భారత క్రీడాకారుల విజయ పరంపర కొనసాగుతోంది. ఒకదాని తర్వాత మరో విభాగంలో పతకాల పంట పండిస్తున్నారు. షూటింగ్ తో ప్రారంభమైన పతకాల వేట రెజ్లింగ్, టెన్నిస్ ను దాటుకుని ఇప్పుడు రోయింగ్ కి చేరింది. రోయింగ్ విభాగంలో భారత క్రీడాకారులు ఒకే రోజు మూడు పతకాలు సాధించి దేశ ప్రతిష్టను మరింత పెంచారు. ఈ పతకాల్లో ఓ స్వర్ణంతో పాటు రెండు కాంస్యాలున్నాయి.
 
ఆరో రోజుకు చేరిన ఆసియా క్రీడల్లో భారత రోయర్ల హవా కొనసాగింది. పురుషులు క్వాడ్రపుల్ స్కల్స్ విభాగంలో సవర్ణ్‌సింగ్‌, దత్తు భోకనల్‌, ఓం ప్రకాశ్‌, సుఖ్‌మీత్‌ సింగ్‌లతో కూడిన భారత జట్టు కేవలం 6నిమిషాల17.13సెకన్లలో లక్ష్యాన్ని పూర్తిచేసి మొదటి స్థానంలో నిలిచారు. దీంతో వీరి బృందానికి స్వర్ణ పతకం లభించింది. రెండో స్థానంలో నిలిచి థాయ్ లాండ్ బృందం రజతం సాధించగా, ఆతిథ్య ఇండోనేషియా కాస్యంతో సరిపెట్టుకుంది.  

ఇక ఇదే విభాగంలో లైట్ వెయిట్ స్కల్స్ లో దుశ్యంత్ 7నిమిషాల 18.76 సెకన్ల టైమింగ్ తో మూడో స్థానంలో నిలిచి కాస్యం గెలుచుకున్నాడు. అలాగే లైట్ వెయిట్ డబుల్ స్కల్స్ కేటగిరీలో రోహిత్ కుమార్- భగవాన్ సింగ్ జోడీ 7నిమిషాల 04.61 సెకన్ల టైమింగ్ తో కాంస్యం సాధించారు.

click me!