పంత్ కి గోల్డెన్ ఛాన్స్..హర్భజన్

By ramya NFirst Published Feb 23, 2019, 9:46 AM IST
Highlights

టీంఇండియా  పంత్ కి గోల్డెన్ ఛాన్స్ దక్కిందని సీనియర్ ఆటగాడు హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డారు. 

టీంఇండియా  పంత్ కి గోల్డెన్ ఛాన్స్ దక్కిందని సీనియర్ ఆటగాడు హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డారు. మరో రెండు రోజుల్లో ఆస్ట్రేలియాతో టీం ఇండియాకి టీ20 సిరీస్ జరగనున్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ నేపథ్యంలో హర్భజన్.. పంత్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఆస్ట్రేలియాతో జరగనున్న మ్యాచ్ లో పంత్ రాణిస్తే.. ప్రపంచ కప్ లో పాల్గొనబోయే  టీంఇండియాలో పంత్ కి చోటు లభిస్తుందని హర్భజన్ అన్నారు.

‘పంత్‌కు ఆస్ట్రేలియా సిరీస్‌ సువర్ణావకాశం. ఈ సిరీస్‌లో రాణిస్టే ప్రపంచకప్‌లో పంత్‌ను మనం తప్పకుండా చూడవచ్చు. ఒకేవేళ ఈ సిరీస్‌లో పంత్‌ దారుణంగా విఫలమైతే ప్రపంచకప్‌ దారులు మూసుకపోయే అవకాశం ఉంది. మరి పంత్‌ ఏం చేస్తాడో చూడాలి. ఇక ఇదే సిరీస్‌లో కేఎల్‌ రాహుల్‌ విపలమైతే ప్రపంచకప్‌లో పంత్‌ ఓపెనర్‌గా వచ్చినా ఆశ్యర్యపోవాల్సిన అవసరం లేదు. పంత్‌ ఓపెనర్‌గా తీసుకోవాలని అనుకుంటే దినేశ్‌ కార్తీక్‌కు కూడా జట్టులో అవకాశం ఉంటుంది’అంటూ భజ్జీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

click me!