యోయో టెస్ట్ పై స్పందించిన అంబటి రాయుడు...ఏమన్నాడంటే

By Arun Kumar PFirst Published Aug 25, 2018, 1:25 PM IST
Highlights

యోయో టెస్ట్...ప్రస్తుతం క్రికెటర్లకు పరీక్షగా మారిన ఫిట్ నెస్ టెస్ట్. దేవుడు కరుణించినా పూజారి అడ్డుకున్నట్లుగా టీం ఇండియాలో ఆడేందుకు సెలెక్టయినా ఈ యోయో టెస్ట్ లో ఫెయిలై పలువురు క్రికెటర్లు మంచి అవకాశాన్ని కోల్పోయారు. ఇలా హైదరబాదీ క్రికెటర్ అంబటి రాయుడు కూడా ఇంగ్లాండ్ తో జరిగిన వన్డే సీరిస్ కు భారత జట్టులో స్థానం సంపాదించినప్పటికి యోయో టెస్ట్ లో విఫలమై ఇంగ్లాండ్ కు వెళ్లలేకపోయాడు రాయుడు. అయితే ఈ టెస్ట్ పై అప్పుడు పలు విమర్శలు చెలరేగిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారంపై రాయుడు స్పందించారు.

యోయో టెస్ట్...ప్రస్తుతం క్రికెటర్లకు పరీక్షగా మారిన ఫిట్ నెస్ టెస్ట్. దేవుడు కరుణించినా పూజారి అడ్డుకున్నట్లుగా టీం ఇండియాలో ఆడేందుకు సెలెక్టయినా ఈ యోయో టెస్ట్ లో ఫెయిలై పలువురు క్రికెటర్లు మంచి అవకాశాన్ని కోల్పోయారు. ఇలా హైదరబాదీ క్రికెటర్ అంబటి రాయుడు కూడా ఇంగ్లాండ్ తో జరిగిన వన్డే సీరిస్ కు భారత జట్టులో స్థానం
సంపాదించినప్పటికి యోయో టెస్ట్ లో విఫలమై ఇంగ్లాండ్ కు వెళ్లలేకపోయాడు రాయుడు. అయితే ఈ టెస్ట్ పై అప్పుడు పలు విమర్శలు చెలరేగిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారంపై రాయుడు స్పందించారు.

క్రికెటర్లు ఖచ్చితంగా మంచి ఫిట్ నెస్ తో ఉండాలని తాను భావిస్తున్నట్లు రాయుడు తెలిపారు. అందుకోసం ప్రతి ఒక్క క్రికెటర్ యోయో టెస్ట్ ను ఫాలో అవ్వాల్సిందేనని అన్నారు. అయితే ఇంగ్లాండ్ వన్డే సీరిస్ కు ముందు ఈ యోయో టెస్ట్ లో ఉత్తీర్ణత సాధించలేక పోవడం తనను ఎంతో నిరాశకు గురిచేసినట్లు ఆయన తెలిపారు. ఆ తర్తాత ఫిట్ నెస్ పై ప్రత్యేక శ్రద్ద కనబర్చి ఈ టెస్ట్ లో పాసయ్యానని రాయుడు తెలిపారు.

అంబటి రాయుడు తో పాటు కేరళ ఆటగాడు సంజూ శాంసన్ కూడా ఈ యోయో టెస్ట్ లో విఫలమయ్యాడు. దీంతో పలువురు మాజీలతో పాటు క్రికెట్ విశ్లేషకులు ఈ టెస్ట్ పై విమర్శలు గుప్పించారు. మంచి ఫామ్ లో వున్న క్రికెటర్లను ఇలా ఫిటినెస్ పేరుతో పక్కనపెట్టడం మంచిదికాదని బిసిసిఐ కి సూచించారు. ఆటగాళ్లకు ఫిట్ నెస్ ఒక్కటే సరిపోదని మంచి ప్రతిభ, ఫామ్ అవసరమని వారు అభిమానులు కూడా వారికి వంత పాడారు. ఈ సమయంలో అంబటి రాయుడు ఈ టెస్ట్ క్రికెటర్లకు ఎంతో అవసరమని చెప్పడం విశేషం. 

 

click me!