హార్దిక్ కామెంట్స్ పై బిగ్ బాస్ బామ రెస్పాన్స్..

By ramya neerukondaFirst Published Jan 19, 2019, 12:40 PM IST
Highlights

కాఫీ విత్ కరణ్ షోలో అమ్మాయిలను కించపరిచేలా పాండ్యా చేసిన కామెంట్స్ కి నెటిజన్లు మండిపడ్డారు. ఈ విషయంలో పాండ్యా క్షమాపణలు చెప్పినప్పటికీ.. నెటిజన్లు ట్రోలింగ్ మాత్రం ఆపలేదు. 

టీం ఇండియా యవ క్రికెటర్ హార్దిక్ పాండ్యా ఇటీవల వివాదంలో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. కాఫీ విత్ కరణ్ షోలో అమ్మాయిలను కించపరిచేలా పాండ్యా చేసిన కామెంట్స్ కి నెటిజన్లు మండిపడ్డారు. ఈ విషయంలో పాండ్యా క్షమాపణలు చెప్పినప్పటికీ.. నెటిజన్లు ట్రోలింగ్ మాత్రం ఆపలేదు. 

తాజాగా పాండ్యా కామెంట్స్ పై ఆయన రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్.. బిగ్ బాస్ కంటిస్టెంట్ ఎలీ అవ్రామ్  స్పందించారు. ఓ అవార్డు ఫంక్షన్ కి వచ్చిన ఆమెను మీడియా పాండ్యా కామెంట్స్ పై మీ అభిప్రాయం ఏమిటని ప్రశ్నించగా.. ‘‘ పాండ్యా కామెంట్స్ విని నేను  షాకింగ్ గురయ్యా. ఎందుకంటే.. నాకు తెలిసిన పాండ్యా వేరు. పాండ్యా చేసిన కామెంట్స్ పై ప్రజలు స్పందించడం చాలా గొప్ప విషయం. ఇలాంటి బిగేవియర్ మంచిది కాదు. ప్రజలు రియాక్ట్ అవ్వకపోతే ఆ విషయం తనకు తెలిసేది కాదు’’ అని ఆమె కామెంట్ చేశారు.

అనంతరం హార్దిక్ పాండ్యాపై బీసీసీఐ సస్పెన్షన్ విధించడం పై కూడా ఆమె స్పందించారు. ‘‘ పాండ్యా ను బీసీసీఐ సస్పెండ్ చేసిన విషయాన్ని నేను వార్తలో చదివాను. దేశానికి ప్రాతినిధ్యం వహించాల్సిన అవకాశం వచ్చినప్పుడు దానిని తేలకగా తీసుకోకూడదు. అది చాలా గొప్ప అధికారం. మన తరవాతి తరానికి మనం ఆదర్శంగా ఉండాలి. ఎందుకంటే.. మన నుంచే వారు అన్నీ నేర్చుకుంటారు’’ అని ఆమె పేర్కొన్నారు.

పాండ్యా విషయంపై పాండ్యా మరో రూమర్డ్ గర్లఫ్రెండ్ ఈషా గుప్త వద్ద ప్రస్తావించగా.. ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసలు పాండ్యా ఎవరో కూడా తనకు తెలీదంటూ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. 

click me!