ఇష్టమైన కెప్టెన్ ధోనీనా, దాదానా: ఇద్దరు కాదంటున్న గంభీర్

By sivanagaprasad kodatiFirst Published Dec 9, 2018, 4:28 PM IST
Highlights

భారత క్రికెట్‌కు ఓపెనర్‌గా సేవలు అందించిన గౌతమ్ గంభీర్ ఇంటర్నేషనల్ క్రికెట్‌కు వీడ్కోలు తెలిపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నీకు ఇష్టమైన నాయకుడు ఎవరు అంటూ అతనిని ప్రశ్నించగా సౌరవ్ గంగూలి అనో, మహేంద్ర సింగ్ ధోనీ అనో చెబుతాడని అందరూ అనుకున్నారు.

భారత క్రికెట్‌కు ఓపెనర్‌గా సేవలు అందించిన గౌతమ్ గంభీర్ ఇంటర్నేషనల్ క్రికెట్‌కు వీడ్కోలు తెలిపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నీకు ఇష్టమైన నాయకుడు ఎవరు అంటూ అతనిని ప్రశ్నించగా సౌరవ్ గంగూలి అనో, మహేంద్ర సింగ్ ధోనీ అనో చెబుతాడని అందరూ అనుకున్నారు.

కానీ వీరికి భిన్నంగా లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లేనే తన అల్‌టైమ్ బెస్ట్ కెప్టెన్ అని అభివర్ణించాడు గౌతీ. ‘ కెప్టెన్‌కి నాయకుడికి తేడా ఉంటుంది.. నా కెరీర్‌లో చాలామంది కెప్టెన్ల కింద ఆడాను.. కానీ స్వార్థం లేని, నిజాయితీగల వ్యక్తి నాయకత్వంలో చాలా నేర్చుకున్నా ఆయనే అనిల్ కుంబ్లే.

అతని కెప్టెన్సీలో కేవలం ఐదు టెస్టులు మాత్రమే ఆడానని.. నాకున్న నాయకత్వ లక్షణాలన్నీ అనిల్ వద్దే నేర్చుకున్నానని.. నిస్వార్థంగా ఉండటం, అభిరుచితో ఆడటం, తన ఆటపై నీతిగా ఉండటం చూశాను..? అందుకే తన దృష్టిలో కుంబ్లేనే అత్యుత్తమ నాయకుడు అని గంభీర్ తెలిపాడు. రాహుల్ ద్రవిడ్ కెప్టన్సీ నుంచి తప్పుకున్నప్పుడు 2007 నుంచి 2008 వరకు కుంబ్లే టీమిండియాను సారథిగా నడిపించాడు.

టీమిండియా మహిళా జట్టు కోచ్ పదవికి అప్లికేషన్ వేసిన గిబ్స్

అడిలైడ్ టెస్ట్: పోరాడుతున్న ఆస్ట్రేలియా, ఆరు వికెట్ల దూరంలో భారత్

అడిలైడ్ టెస్ట్‌లో కోహ్లీ అరుదైన రికార్డు...

130 ఏళ్ల చెత్త రికార్డును బద్దలు కొట్టిన షాన్ మార్ష్

తెలంగాణ ఎన్నికలు.. గుత్తా జ్వాల ఓటు గల్లంతు

82 ఏళ్ల నాటి రికార్డును బద్దలుకొట్టిన పాక్ క్రికెటర్

ఆడటం వచ్చా..టీమిండియా చెత్త బ్యాటింగ్‌పై గావస్కర్ ఫైర్

అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన గంభీర్...

click me!