హ్యాట్సాఫ్ గంభీర్... ప్రపంచానికి మరోసారి నువ్వేంటో తెలియచెప్పావు!

By telugu teamFirst Published Oct 20, 2019, 1:12 PM IST
Highlights

భారత మాజీ క్రికెటర్, ప్రస్తుత పార్లమెంటు సభ్యుడు గౌతమ్ గంభీర్ మరోసారి అతనెంత మానవతావధూ నిరూపించుకున్నాడు. పాకిస్థాన్ కు చెందిన ఒక చిన్నారి శాస్త్ర చికిత్స నిమిత్తం భారత్ రావడానికి వీసా వచ్చేలా చూసాడు. 

న్యూ ఢిల్లీ: భారత మాజీ క్రికెటర్, ప్రస్తుత పార్లమెంటు సభ్యుడు గౌతమ్ గంభీర్ మరోసారి అతనెంత మానవతావధూ నిరూపించుకున్నాడు. పాకిస్థాన్ కు చెందిన ఒక చిన్నారి శాస్త్ర చికిత్స నిమిత్తం భారత్ రావడానికి వీసా వచ్చేలా చూసాడు. 

పాకిస్తాన్ కు చెందిన ఉమామియా అలీ అనే 6సంవత్సరాల వయసున్న చిన్నారి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. ఆ చికత్స కోసం భరత్ కు వచ్చేందుకు వారు వీసా కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీసా పొందడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. 

ఈ విషయం తెలుసుకున్న గౌతమ్ గంభీర్ కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి జయశంకర్ ను వారికి వీసా ఇచ్చే ఏర్పాట్లు చేయమని కోరారు. గంభీర్ అడగగానే జయశంకర్ కూడా వెంటనే రెస్పొంద్ అయ్యారు. చిన్నారితోపాటు ఆమె తల్లిదండ్రులకు కూడా వీసాలు జారీ చేయవలిసిందిగా పాకిస్తాన్ లోని భారత హై కమిషన్ కు చెప్పారు. జయశంకర్ ఆదేశాలానుసారం భారత దౌత్యాధికారులు వారికి వీసాలు జారీ చేసారు. 

వీసాలు జారీ అవ్వగానే జయశంకర్ గంభీర్ కు ఈ విషయమై ఒక లేఖ రాసారు. ఈ లేఖను గంభీర్ ట్విట్టర్లో పోస్ట్ చేసి, "అవతలివైపు నుంచి ఒక పసి హృదయం మనల్ని సంప్రదించినప్పుడు, మన హద్దులను చెరిపేసేలా చేస్తుంది. పాక్ చిన్నారి భారత్ కు రావడం ఒక ఆడపడుచు పుట్టింటికొచ్చినట్టనిపిస్తుంది. భారత్ లోకి అడుగుపెడుతున్న ఓ పాక్ చిట్టి తల్లి నీకు భారత దేశానికి వెల్కమ్!" అంటూ రాసుకొచ్చారు. అంతేకాకుండా ఇంత సత్వరంగా స్పందించిన విదేశాంగ శాఖకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 

మరో పోస్టులో, "నేను ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ ప్రభుత్వానికి మాత్రమే వ్యతిరేకిని తప్ప పాకిస్తాన్ ప్రజల వ్యతిరేకిని కాను. ముక్కుపచ్చలారని ఈ చిట్టితల్లి భారత్ లో వైద్యం చేయించుకొని ప్రాణాలు దక్కించుకుంటే, అంతకంటే ఆనందమేముంటుంది!" అని చెప్పుకొచ్చారు. 

చిన్నారి ప్రాణాలు కాపాడేందుకు ఇంత చొరవ చూపించిన గంభీర్ పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. క్రికెటర్ గానే కాదు, గోప మానవతా వాదిగా నిరూపించుకున్నావ్ అని ఒకరంటే, హ్యాట్సాఫ్ గంభీర్... నువ్వెంతో మరోసారి ప్రపంచానికి తెలియపరిచావు అని ఇంకొకరన్నారు. మొత్తానికి గంభీర్ చేసిన ఇంత గొప్ప పనిని ఎవరు మాత్రం అభినందించకుండా ఉంటారు చెప్పండి. 

click me!