ఒలంపిక్స్: సానియా మీర్జా సలహా అడిగిన ప్రధాని మోదీ..!

By telugu news team  |  First Published Jul 14, 2021, 11:13 AM IST

క్రీడాకారులంతా తమ ఆటపైనే దృష్టి పెడితే చాలని, అంచనాలను మోయాల్సిన పనిలేదని అన్నారు. ఏమాత్రం ఒత్తిడిలో కూరుకుపోవద్దని యావత్‌ దేశం వారి అత్యుత్తమ ప్రదర్శన కోసమే ఎదురు చూస్తోం దని అథ్లెట్లతో మోదీ అన్నారు. 
 


టోక్యో ఒలంపిక్స్ లో విజయం సాధించాలని భారత క్రీడాకారులతో.. ప్రధాని నరేంద్రమోదీ.. సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో.. ఆయన భారత క్రీడాకారులందరితో సంభాషించారు. గెలిచి.. దేశానినకి పతకాలు తీసుకురావాలంటూ ఉత్సాహానిచ్చారు.

క్రీడాకారులంతా తమ ఆటపైనే దృష్టి పెడితే చాలని, అంచనాలను మోయాల్సిన పనిలేదని అన్నారు. ఏమాత్రం ఒత్తిడిలో కూరుకుపోవద్దని యావత్‌ దేశం వారి అత్యుత్తమ ప్రదర్శన కోసమే ఎదురు చూస్తోం దని అథ్లెట్లతో మోదీ అన్నారు. 

Latest Videos

undefined

ఈ కార్యక్రమంలో స్టార్‌ షట్లర్, ప్రపంచ చాంపియన్‌ పీవీ సింధు, బాక్సింగ్‌ దిగ్గజం మేరీకోమ్, టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా, షూటర్లు సౌరభ్‌ చౌదరి, ఇలవెనిల్‌ వలరివన్, టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) ప్లేయర్లు శరత్‌ కమల్, మనిక బాత్రా, ప్రపంచ నంబర్‌వన్‌ ఆర్చర్‌ దీపిక కుమారి, బాక్సర్‌ ఆశిష్‌ కుమార్, స్టార్‌ స్ప్రింటర్‌ ద్యుతీచంద్‌ తదితరులతో మోదీ ముచ్చటించారు. వారిలో స్ఫూర్తి నింపారు.

ఈ సందర్భంగా.. మోదీ.. సానియామీర్జా తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ ఒలంపిక్స్ నేపథ్యంలో.. సలహా ఇవ్వాలని సానియామీర్జాని మోదీని కోరారు.

దీంతో సానియా మీర్జా మాట్లాడుతూ... ‘ఎవరైనా ఉన్నతస్థానానికి చేరుకోవచ్చని యువ క్రీడాకారులు భావిస్తున్నారు. అయితే వాళ్లు లక్ష్యం కోసం బాగా కష్టపడాలి. అంకితభావంతో ముందడుగు వేయాలి. అప్పుడే అదృష్టం కూడా కలిసొస్తుంది. అంతేకానీ కఠోర శ్రమ, అంకితభావం లేకపోతే అదృష్టరేఖ కూడా ఏమీ చేయలేదు’ అని సానియా చెప్పింది.  


 

click me!