విండీస్ పర్యటన... దినేష్ కార్తీక్ పై వేటు?

By telugu teamFirst Published Jul 18, 2019, 3:37 PM IST
Highlights

ధోనీని విస్టీండీస్ పర్యటనకు ఎంపిక చేయరంటూ ఇప్పటికే ప్రచారం మొదలైంది. త్వరోలనే ధోనీ రిటైర్మెంట్ ప్రకటించనున్నారని.. అందుకే ఈ పర్యటనకు దూరం కానున్నారని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. కాగా.. ఇప్పుడు దినేష్ కార్తీక్, కేదార్ జాదవ్ లను కూడా సెలక్టర్లు పక్కన పెట్టేశారంటూ ప్రచారాం జరుగుతోంది.

వరల్డ్ కప్ లో టీం ఇండియా సెమీ ఫైనల్స్ లో చేతులెత్తేసింది. అప్పటి వరకు అద్భుతంగా ఆడుతూ వచ్చిన టీం ఇండియా సెమీ ఫైనల్స్ ఓటమితో వెనుదిరగాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా వచ్చే నెలలో టీం ఇండియా వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. అయితే... ఈ పర్యటకి కొందరు క్రికెటర్లు దూరం కానున్నారనే ప్రచారం జరుగుతోంది. వారిలో టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీతోపాటు దినేష్ కార్తీక్, కేదార్ జాదవ్ లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

ధోనీని విస్టీండీస్ పర్యటనకు ఎంపిక చేయరంటూ ఇప్పటికే ప్రచారం మొదలైంది. త్వరోలనే ధోనీ రిటైర్మెంట్ ప్రకటించనున్నారని.. అందుకే ఈ పర్యటనకు దూరం కానున్నారని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. కాగా.. ఇప్పుడు దినేష్ కార్తీక్, కేదార్ జాదవ్ లను కూడా సెలక్టర్లు పక్కన పెట్టేశారంటూ ప్రచారాం జరుగుతోంది.

వరల్డ్ కప్ లో దినేష్ కార్తీక్ అవకాశం వచ్చిన రెండు సార్లు విఫలమయ్యాడు.  బంగ్లాతో జరిగిన మ్యాచ్ లో కేవలం 8 పరుగులు మాత్రమే చేసిన దినేష్ కార్తీక్.. సెమీస్ మ్యాచ్ లో 6 పరుగులకే పరిమితమయ్యాడు. దీంతో... అతనిని ఈ పర్యటనకు సెలక్టర్లు దూరంగా ఉంచుతున్నట్లు సమాచారం. దినేష్ కార్తీక్ తోపాటు కేదార్ జాదవ్ కూడా వరల్డ్ కప్ లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. స్లో ఇన్నింగ్స్ తో విసిగించేశాడు. ఈ ప్రభావం ప్రస్తుతం విండీస్ పర్యటనపై పడిందని తెలుస్తోంది.

ఇక వీరి ముగ్గురి స్థానంలో యువ క్రికెటర్లు రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, శుభమన్ గిల్ కి చోటు కల్పించనున్నట్లు తెలుస్తోంది. విండీస్ పర్యటనకు వెళ్లే జట్టుని జులై 19వ తేదీన ప్రకటించనున్నారు. 

click me!