"సన్" రైజ్ అంటే ఇది: ద్రావిడ్ పుత్రోత్సాహం

By Sandra Ashok KumarFirst Published Dec 20, 2019, 5:07 PM IST
Highlights

రాహుల్ ద్రవిడ్ కుమారుడు సమిత్ కూడా క్రికెట్ యవనికపై తనదైన ముద్రను వేయడం ఆరంభించాడు. అండర్-14 మ్యాచులో అద్భుతంగా రాణిస్తున్న సమిత్ ఏకంగా డబల్ సెంచరీ బాదాడు. జరుగుతున్న ఇంటర్ జోనల్ టోర్నమెంటులో 201 పరుగులు చేశాడు.

లెజెండరీ ఇండియన్ బ్యాట్స్ మన్ రాహుల్ ద్రవిడ్ కుమారుడు సమిత్ కూడా క్రికెట్ యవనికపై తనదైన ముద్రను వేయడం ఆరంభించాడు. అండర్-14 మ్యాచులో అద్భుతంగా రాణిస్తున్న సమిత్ ఏకంగా డబల్ సెంచరీ బాదాడు. జరుగుతున్న ఇంటర్ జోనల్ టోర్నమెంటులో 201 పరుగులు చేశాడు. 

also read IPL Auction: జాక్ పాట్ కొట్టేసిన భారత కుర్రాళ్ళు వీరే!

యువ సమిత్ తన తండ్రి అడుగుజాడలను అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది, సమీప భవిష్యత్తులో దేశం మరొక ద్రవిడ్ క్రికెట్ పిచ్‌పై బౌలర్లను ఇబ్బంది పెట్టడాన్ని చూడవచ్చన్నమాట. బెంగళూరులో కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్, అండర్ -14 ఇంటర్ జోనల్ టోర్నమెంట్లో 14 ఏళ్ల సమిత్ వైస్ ప్రెసిడెంట్స్ ఎలెవన్ కోసం టాప్-క్లాస్ ఆటతీరు ప్రదర్శించి ద్విశతకం నమోదు చేసాడు.

 తొలి ఇన్నింగ్స్ లో డబల్ సెంచరీ సాధించిన సమిత్... రెండవ ఇన్నింగ్స్‌లోనూ బ్యాట్‌తో తన ప్రతిభను కనబర్చాడు.  అక్కడ అతను తన జట్టు టోటల్ స్కోర్ కి 94 పరుగులు జోడించాడు. ఆ తరువాత ధార్వాద్ జోన్ బ్యాటింగ్ లైన్ అప్ ను 3/26 బౌలింగ్ స్పెల్‌తో కోలుకోలేని దెబ్బతీసాడు.

also read కీలక నిర్ణయం తీసుకున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్

 2018 లో కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (కెఎస్‌సిఎ) బిటిఆర్ కప్ అండర్ -14 ఇంటర్ స్కూల్ టోర్నమెంట్‌లో మాల్యా అదితి ఇంటర్నేషనల్ స్కూల్ కోసం సమిత్ 150 పరుగులు చేశాడు. అప్పట్లో అదొక సంచలన స్కోర్ గా కర్ణాటక క్రికెట్ వర్గాలు చెప్పుకున్నాయి. 

ఈ జూనియర్ ద్రావిడ్ 2005లో బెంగుళూరు లో జన్మించాడు. ద్రావిడ్ కోచింగ్ లోనే ఈ చిచ్చరపిడుగు ఆరితేరాడు. ఇక్కడ తండ్రి కొడుకుల మధ్య ఒక వ్యత్యాసం ఉంది. తండ్రి ద్రావిడ్ ఒక డిఫెన్సివ్ బ్యాట్స్ మెన్ కాగా... ఇతగాడు మాత్రం అత్తచ్కింగ్ బ్యాట్స్ మెన్. రాహుల్ ద్రవిడ్ ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీలో క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.

click me!